ఈ సంక్రాంతికి ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ రావడం ఖాయం. సంక్రాంతికి వస్తుంది అనుకున్న సర్కారు వారి పాట సినిమాను మహేష్ బాబు జక్కన్న కోసం వాయిదా వేశారు. సంక్రాంతికి రావాల్సిన సర్కారు వారి పాట ఏప్రిల్ 1కి వాయిదా పడింది. ఈ సినిమా వలే పవర్ స్టార్ భీమ్లా నాయక్ కూడా వాయిదా పడుతుందని ప్రచారం జరిగింది. అయితే.. ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేలా భీమ్లా నాయక్ సంక్రాంతి కానుకగా జనవరి 12న రావడం పక్కా అనేలా స్టేట్ మెంట్ ఇచ్చారు. సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక అందరి దృష్టి బంగార్రాజు పై పడింది. సంక్రాంతికి బంగార్రాజు మూవీ వస్తుందా..? వాయిదా పడుతుందా..? అనేది ఆసక్తిగా మారింది.
అయితే.. భీమ్లా నాయక్ రాకపోతే బంగార్రాజు వస్తాడు అనే టాక్ ఉంది. భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటికీ బంగార్రాజు ప్రమోషన్ మాత్రం ఆపలేదు. బంగార్రాజు సినిమా నుంచి నాగలక్ష్మి పాత్రను పరిచయం చేసే పోస్టర్ ను విడుదల చేస్తున్నట్టుగా నాగచైతన్య ప్రకటించాడు. దీంతో బంగార్రాజు విడుదల అనేది సస్పెన్స్ గా మారింది. అంతే కాకుండా.. అసలు బంగార్రాజు ప్లాన్ ఏంటి…? అని ఆరా తీస్తే.. తెలిసింది ఏంటంటే… భీమ్లా నాయక్ లాస్ట్ మినిట్ లో సంక్రాంతి బరి నుంచి తప్పుకునే ఛాన్స్ ఉంది. అందుచేత బంగార్రాజు ప్రమోషన్ ను కంటిన్యూ చేస్తున్నారట.
డిసెంబర్ నెలాఖరులో సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్స్ పై ముఖ్యంగా భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ పై ఫుల్ క్లారిటీ వస్తుంది. అందుచేత అప్పటి వరకు బంగార్రాజు రిలీజ్ డేట్ ప్రకటించాలి అనుకోవడం లేదట నాగార్జున. భీమ్లా నాయక్ వాయిదా పడితే.. బంగార్రాజు సంక్రాంతికి వస్తాడట. ఒకవేళ భీమ్లా నాయక్ సంక్రాంతికి వస్తే.. బంగార్రాజు రిపబ్లిక్ డేకి రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. ఏది ఏమైనా.. బంగార్రాజు విడుదల గురించి క్లారిటీ రావాలంటే డిసెంబర్ నెలాఖరు వరకు ఆగాల్సిందే.
Must Read ;- లడ్డుండా.. సాంగ్ తో అదరగొట్టిన బంగార్రాజు











