టీటీటీ ఆదేశాలతో రోడ్డున పడనున్న 3,500 మంది కార్మికుల జీవితాలు!
ఏపీలో ఉద్యోగుల స్వేచ్ఛ, హక్కుల హరించేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. పీఆర్సీ ఇవ్వంకుండా ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బందుకు గురిచేస్తుంటే .. మరోపక్క అంగన్ వాడీలకు, ఆశ వర్కర్లకు జీతాలు సకాలం ఇవ్వలేక తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇదిలా ఉంటే తిరుమలలో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రక్ట్ కార్మికులు వారి డిమాండ్స్ సాధనకు వారం రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. తమను కార్పోరేషన్ లోకి తీసుకుని ఉద్యోగ భద్రత కల్పించాలని ఎఫ్ఎంఎస్ సర్వీసెస్ లో విధులు నిర్వర్తిస్తున్న కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించడం మాని .. ఒకేసారి 3,500 మంది కార్మికులను తక్షణమే తొలగించాలని కాంట్రాక్టర్ కు టీటీడీ ఆదేశాలు జారీ చేయడంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.
వసతి గదులు దొరకకా తీవ్ర ఇబ్బందుల్లో భక్తులు!
తిరుమలలో టీటీడీ ఒప్పంద కార్మికులు చేస్తున్న ఆందోళన సెగ శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తులకు సైతం తాకుతోంది. భక్తులకు వసతులు కల్పించే అద్దె గదులు అపరిశుభ్రంగా ఉండటంతో అధికారులు గదులను కేటాయించలేకపోతున్నారు. ఉదయం 6 గంటల నుంచి గదుల కోసం వేచి చూస్తున్న భక్తులకు ఇప్పటికీ గదులను కేటాయించలేకపోయారని భక్తులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. గదులను శుభ్రం చేయకపోవడంతో భక్తులకు రూమ్స్ ఇవ్వలేకపోతున్నామని టీటీడీ అధికారులు చెబుతున్నారు. మరోవైపు తిరుమల మాడవీధుల్లో అపశుభ్రత దర్శనిమిస్తోంది. స్వామి వారి దర్శనార్ధం వచ్చే భక్తులకు కనీస వసతులు కల్పించడం టీటీడీ విధి. అటువంటిది వారంరోజులు నుంచి కార్మికుల విధులు బహిష్కరించి ఆందోళన చేస్తుంటే పరిష్కరించకుండా భక్తులను ఈ విధంగా ఇబ్బందులకు గురిచేయడం సరికాదని ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
Must Read ;- కస్సు .. బుస్సు ..! జగన్ రెడ్డి వార్నింగ్ తుస్సు!










