అక్కినేని నాగచైతన్య .. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ లో నటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 16న విడుదల కావాల్సిన ఈ సినిమా కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా. వాయిదా పడి.. మరో కొత్త డేట్లో త్వరలోనే విడుదల కాబోతోంది. ఇక చైతూ నటిస్తోన్న తాజా చిత్రం ‘థాంక్యూ’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ థ్రిల్లర్ మూవీకి బి.వి.యస్.రవి కథ అందించాడు. ఇంతకు ముందు అక్కినేని ఫ్యామిలీకి మనం లాంటి మెమరబుల్ మూవీ అందించిన విక్రమ్ తో .. చైతూ.. మరోసారి వర్క్ చేయనుండడం విశేషంగా మారింది.
ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ మినహా .. ‘థాంక్యూ’ మూవీ టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. ఇటలీలో ఆఖరి షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సినిమాలో అతి కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ ఆ షెడ్యూల్ లోనే జరగనున్నాయట. ఇందులో మహేశ్ బాబు వీరాభిమానిగా నాగచైతన్య నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కథ ఆ పాయింట్ తోనే మలుపు తిరుగుతుందని అంటున్నారు. అందుకే ఈ సినిమా మీద పూర్తి కాన్ఫిడెన్స్ తో ఉన్నారు మేకర్స్. నాగచైతన్య కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుందని అంటున్నారు. దిల్ రాజ్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమాను చాలా భాగం వైజాగ్ లోనే చిత్రీకరించారు. మరి థాంక్యూ సినిమా చైతూకి ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి.
Must Read ;- చైతూ ‘లవ్ స్టోరీ’ విడుదలకు బ్రేక్











