నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఈ రెండు విభిన్న పాత్రల్లో ఒక పాత్ర అఘోరా పాత్ర అని వార్తలు వచ్చాయి కానీ.. డైరెక్టర్ బోయపాటి మాత్రం ఈ పాత్ర పై క్లారిటీ ఇవ్వలేదు.

ఇదిలా ఉంటే.. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన ‘సింహ, లెజెండ్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ అవ్వడంతో తాజా సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. ఉగాది కానుకగా ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ని భారీ స్ధాయిలో రిలీజ్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలా వార్తలు వచ్చినప్పటి నుంచి ఉగాదికి ఈ క్రేజీ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడం నిజమేనా.? కాదా.? అనేది ఆసక్తిగా మారింది.
అయితే.. ఇప్పటికే ఈ సినిమా ఆలస్యం అవ్వడంతో ఎలాంటి బ్రేక్ లేకుండా కంటిన్యూగా షూటింగ్ చేస్తున్నారు. యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో నిర్మిస్తున్నారు. సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు చాలా సినిమాలు పోటీపడుతున్నాయి.అయితే.. ఈ క్రేజీ మూవీని ఉగాదికి రిలీజ్ చేయాలనుకుంటున్నారని తెలిసింది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. బాలయ్య, బోయపాటి మూవీ ఉగాదికి రిలీజ్ కావచ్చు. మరి.. త్వరలోనే టైటిల్ తో పాటు రిలీజ్ పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
Must Read ;- బాలయ్యతో మూవీ ప్లాన్ చేస్తున్న ‘క్రాక్’ డైరెక్టర్











