టాలీవుడ్ యువ హీరో, నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. చకచకా సినిమాలను పూర్తి చేయడంలో నాని ముందుంటాడు అనడంలో సందేహం లేదు. వచ్చే సంవత్సరం 2021లో నాని మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇదేమి నానికి కొత్త కాదు. 2011లో నాని నటించిన ‘అలా మొదలైంది’, ‘సెగ’, ‘పిల్ల జమీందార్’ సినిమాలు రిలీజ్ అయ్యాయి.
ఇందులో ‘అలా మొదలైంది’, ‘పిల్ల జమీందార్’ మంచి విజయాలు సాధించాయి. అలాగే 2015లో ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘జెండాపై కపిరాజు’, ‘భలే భలే మగాడివోయ్’ రిలీజ్ అయ్యాయి. ఇందులో ‘జెండాపై కపిరాజు’ మినహా మిగిలిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక 2016లో కూడా నాని మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అవి ఏమిటంటే ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’, ‘జెంటిల్ మన్’, ‘మజ్ను’. ఈ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి.
Also Read ;- నానీ కూడా టక్ మని స్టార్ట్ చేసేశాడు
ఫైనల్ గా 2017లో నాని ‘నేను లోకల్’, ‘నిన్ను కోరి’, ‘ఎంసీఏ’ సినిమాలను రిలీజ్ చేసాడు. ఇవి కూడా మంచి విజయాలు సాధించి నానికి తిరుగు లేని క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. ఇలా నాలుగు సార్లు ఒకే ఏడాదిలో నాని మూడు సినిమాలతో మన ముందుకు వచ్చాడు. ఈ సెంటిమెంట్ నానికి బాగా కలిసి వచ్చింది. అసలు 2020 సంవత్సరంలో మూడు సినిమాలు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసాడు నాని. కానీ కుదర్లేదు. వచ్చే ఏడాదిలో మాత్రం నాని మూడు సినిమాలతో మన ముందుకు రాబోతున్నాడు.
2021 ఏడాది ఆరంభంలో ‘టక్ జగదీష్’, ఏడాది మధ్యలో ‘శ్యామ్ సింగ రాయ్’, ఏడాది చివరిలో వివేక్ ఆత్రయతో చేయబోతున్న సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాడు నాని. నాని అనుకున్నట్టు ఈ మూడు సినిమాలు రిలీజ్ అయితే ఆయన అభిమానులకు పండుగనే చెప్పాలి. నానికి కలిసి వచ్చిన సెంటిమెంట్ తో మరల ఒకే ఏడాదిలో మూడు సినిమాలను రిలీజ్ చేసి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు. మరి తను అనుకున్నట్లు మూడు సినిమాలు రిలీజ్ చేసి హ్యాట్రిక్ కొడతాడో లేదో చూడాలి మరి.
Must Read ;- మరోసారి జతకట్టనున్న నాని, రష్మిక మందన్నా?











