నేచురల్ స్టార్ నాని వరస సినిమాలతో టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ‘టాక్ జగదీష్’ సినిమా సెట్స్ పై ఉంది. ఇది కాకుండా మరో రెండు సినిమాల కథలను ఓకే చేసాడు నాని. ఇప్పుడు ఒక క్రేజీ డైరెక్టర్ తో మరొక సినిమా ఓకే చేసినట్టు టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు మారుతీ. ఇప్పటికే నాని – మారుతీ కలయికలో ‘భలే భలే మగాడివోయ్’ వచ్చింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద విజయం సాధించింది. నాని సినీ జీవితంలో మర్చిపోలేని సినిమా ‘భలే భలే మగాడివోయ్’.
అప్పటివరకు చిన్న హీరోగా ఉన్న నాని ఈ సినిమాతో పెద్ద హీరోల జాబితాలోకి చేరిపోయాడు. మారుతీ ఈ కథను మలిచిన తీరు అద్భుతమనే చెప్పాలి. ‘భలే భలే మగాడివోయ్’ రిలీజ్ అయినప్పటి నుండి వీరిద్దరూ మరల ఒక మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారని అప్పట్లో టాక్ నడిచింది. కాని ఇప్పటి వరకు వీరి కలయికలో మరొక సినిమా రాలేదు. మరల వీరిద్దరూ కలసి ఒక సినిమా చేయబోతున్నారనే వార్త తాజాగా టాలీవుడ్ లో ఊపందుకుంది.
Must Read: కోర్టు మెట్లు ఎక్కనున్న టాలీవుడ్ సినిమాలు
ఇప్పటికే మారుతీ, నానికి ఒక కథ వినిపించాడని, నానికి ఆ కథ బాగా నచ్చడంతో సినిమాకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఈ కథ కూడా ‘భలే భలే మగాడివోయ్’ కథలాగే ఫుల్ కామెడీగా సాగుతుందని సమాచారం. అసలే మారుతీ మంచి కామెడీ టైమింగ్ ఉన్న దర్శకుడు. ఇక నాని కామెడీ టైమింగ్ కోసం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుందో మనకు తెలిసిన విషయమే.
ప్రస్తుతం మారుతీ కథను పక్కాగా తయారు చేసుకొనే పనిలో ఉన్నాడని తెలుస్తోంది. అయితే ఈ సినిమాపై అటు నాని కానీ ఇటు దర్శుకుడు మారుతీ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. త్వరలోనే ఈ సినిమాపై దర్శకనిర్మాతలు మీడియా ముఖంగా వివరాలు తెలియజేస్తారని సమాచారం. ఈ వార్త నిజమైతే ఈ సినిమాపై టాలీవుడ్ లో మంచి అంచనాలు ఉంటాయి అనడంలో సందేహం లేదు. మరి ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
Also Read: కీర్తి సురేష్, నితిన్ లకు డిసెంబరులో ‘రంగు’పడినట్లే