పార్టీ కోసం కష్టపడి పనిచేయండి!
పదవులను పొంది, పనిచేయకుండా మీ పనుల్లో మీరుంటే చర్యలు తప్పవని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు మండిపడ్డారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. పార్టీలోని 20 అనుబంధ విభాగాల బలోపేతంపై చర్చించారు చంద్రబాబు. ఈ సందర్భంగా పార్టీ అనుబంధ కమిటీల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై శ్రేణులు దూకుడు పెంచాలని, ఏదైనా సమస్యలు తలెత్తితే పార్టీ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రజల గోడు పట్టించుకోకుండా, వాటిని పక్కనపెట్టి పార్టీ కార్యాలయాలు చుట్టు తిరిగితే ప్రయోజనం ఉండదన్నారు. పార్టీలో ఉంటూ ఎవరెవరు ఏమీ పనిచేస్తున్నారో అంతా తనకు తెలుసని, పదువులు తీసుకుని క్రీయశీలకంగా వ్యవహరించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు చంద్రబాబు.
ప్రకటనలు కాదు.. పోరాడాలి!
పార్టీ అనుబంధ విభాగాల సమీక్ష సమావేశంలో మరికొంత మంది నేతల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో నాయకులు పత్రిక ప్రకటనలకే పరిమితమవుతున్నారని, ప్రజల సమస్యలపై మీ పోరాటాలు ఎక్కడా? అని ప్రశ్నించారు. రెండు, మూడు విభాగాలు తప్ప మిగతా అనుబంధ కమిటీలు ప్రజల్లోకి వెళ్లలేక పోతున్నాయన్నారు. అలానే పార్టీ అనుబంధ విభాగాల్లో మహిళలకు పెద్దపీట వేయాలని, సమిష్టిగా శ్రమిస్తేనే పార్టీ అధికారంలోకి వస్తోంది చంద్రబాబు సూచించారు.
Must Read:-కేసులతో చంద్రబాబు గడ్డం మీద వెంట్రుక కూడా పీకలేరు : నారా లోకేష్