ఏపీలో స్వాతంత్య్ర దినోత్సవం నాడు గుంటూరులో దళిత విద్యార్థిని రమ్యశ్రీ పైన మృగాడు కత్తితో దాడి చేసి అతి కిరాతకంగా చంపిన విషయం తెలిసిందే. ఆ సంఘటనపై చలించిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అదే రోజు బాధితురాలి కుటుంబ సభ్యులను ఫోన్ లో పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉంటానని, వారి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో మరో చెల్లి ఇలాంటి దారుణానికి గురి కాకుండా పోరాడుతానని కూడా లోకేష్ చెప్పారు.
బాధితురాలి కుటుంబానికి పరామర్శ
మరుసటి రోజు నారా లోకేష్ టీడీపీ నాయకులతో రమ్యశ్రీ ఇంటికి చేరుకొని భౌతికకాయానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ నేపథ్యంలో వందలాది పోలీసు అధికారులు టీడీపీ నాయకుల పట్ల అనుచితంగా ప్రవర్తించి నారా లోకేష్ ను, టీడీపీ నాయకులను అరెస్ట్ చేశారు. నారా లోకేష్ ను పోలీసులు ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. సాయంకాలం వరకు నారా లోకేష్ ను పోలీస్ స్టేషన్ ఉంచిన పొలీసులు రాత్రి సమయంలో పెద కాకాని పోలీస్ స్టేషన్ నుంచి విడుదల చేశారు. ఈ సందర్భంగా లోకేష్ ను పోలీసులు పలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడంపై టీడీపీ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి. అంతేకాకుండా పోలీసులు లోకేష్ ను ఎక్కడికి తీసుకెళితే.. అక్కడికి పోలీసు వాహనం వెంటే తరలివెళ్లిన వైనం కూడా ఆసక్తి రేకెత్తించింది.
21 రోజుల్లో శిక్షించాల్సిందే
అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేంలో నారా లోకేష్ మాట్లాడుతూ చట్ట బద్ధత లేని దిశా చట్టం తో మహిళను మోసం చేస్తున్నారని, రాష్ట్రంలో 500 మంది మహిళలపై దాడులు జరిగితే ఒక్క నిందితుడుని అయినా కఠినంగా శిక్షించారా అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మీ దిశా చట్టం ప్రకారం రమ్యశ్రీ ని చంపిన కిరాతకుడిని 21 రోజులలో కఠినంగా శిక్షించాలని జగన్ ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టారు. లేని పక్షంలో టీడీపీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని వైసీపీ ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.
Must Read ;- నారా లోకేశ్ ను చూస్తుంటే జగన్ కు దడే