ఆంటీలు ఇరగదీసి డ్యాన్సులు వేస్తుంటే ఆంటీలా మజాకా అనక తప్పదు. నలభయ్యో పడిలో పడినా ఇంకా తమలో పస తగ్గలేదని ఈ ఆంటీలు నిరూపిస్తున్నారు. ఇంతకీ ఆ ఆంటీలు ఎవరో కాదు ప్రగతి, సురేఖా వాణి. ఒకరు కూతురితో, ఇంకొకరు కొడుకుతో తీన్మార్ డ్యాన్సులు వేస్తుంటే చూడముచ్చటగానే ఉంటుంది. ఈ ఆంటీలు తరచూ ఇలా డ్యాన్సుల రూపంలో తళుక్కుమంటున్నారు. ఇద్దరూ సినిమాల్లో క్యెరెక్టర్ ఆర్టీస్టులే. మదర్ గా, అక్కలుగా తెర మీద మనకు కనిపిస్తారుగానీ ఇలా డ్యాన్సులు ఇరగదీయడం మాత్రం చూడలేదు.
వీరిలో ఎవరికీ తెలియని ఈ డ్యాన్సు టాలెంట్ ను సోషల్ మీడియాలో ప్రదర్శించి మార్కులు కొట్టేస్తున్నారు. వీరికి వీరి పిల్లలు కూడా తోడై ‘రెచ్చిపోదాం మదర్’ అంటున్నారు. వీరిలోని టాలెంట్ ను ఇంతలా బయటికు తీసిన కరోనాకే ఈ క్రెడిట్ దక్కుతుంది. లాక్ డౌన్ లో ఇంట్లో ఏం చేయాలో పాలుపోని వారికి వీరి డ్యాన్సులు భలే విందు చేసేస్తున్నాయి. వీరి నుంచి ఎప్పుడెప్పుడు కొత్త వీడియో వస్తుందా అని ఎదురుతెన్నులు చూస్తున్నారు. అందాల ఆరబోతలో ప్రగతి ఆంటీని మించిన వారు కనిపించడం లేదు.
మాస్ బీట్ తో ఆమె తన కొడుకుతో కలిసి స్టెప్పులేస్తుంటే అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక సురేఖా వాణి విషయానికి వస్తే ఆమె తన కూతురితో కలిసి డ్యాన్సులు ఇరదదీసేస్తోంది. ‘చిలక పచ్చ కోక’ కట్టి డ్యాన్సు అందుకుంటే చిలక భలేగుందే అంటూ జనం ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నారు. డ్యాన్సుల్లో పాప కూడా ఏమీ తక్కువ తినలేదు. పైగా తల్లి బాటలోనే ఈ తనయ కూడా నడవాలనుకుంటోంది. ఇలాంటివారిని సినిమా ప్రపంచం స్వాగతించకుండా ఎలా ఉంటుంది. సురేఖ తన కూతురితో కలిసి వేసే కోక డ్యాన్సు డ్యాన్సులు కేక పుట్టిస్తున్నాయంటే నమ్మండి.
Must Read ;- తెల్లచీరలో కవ్విస్తోన్న అందాల రంగమ్మత్త











