కోవిడ్ 19 లాక్ డౌన్ .. ఒక్కసారి గా టాలీవుడ్ ఇండస్ట్రీని రిఫ్రెష్ చేసింది. దాదాపు తొమ్మిది నెలల కాలంపాటు.. షూటింగ్స్ కు దూరంగా ఇంట్లోనే బంధీ అయిపోయిన మన హీరోలు .. ఆ గ్యాప్ ను బాగానే సద్వినియోగం చేసుకున్నారు. థియేటర్స్ లేకపోతే ఓటీటీలున్నాయనే భరోసాతో మనుగడ సాగించారు. దాని వల్ల టాలీవుడ్ మార్కెట్ స్థాయి బాగానే పెరిగింది. అందుకేనేమో మన టాలీవుడ్ స్టార్స్ తమ పారితోషికాల్ని భారీగా పెంచేశారు.
రీసెంట్ గా మాస్ మహారాజా రవితేజ. ‘క్రాక్’ బ్లాక్ బస్టర్ పుణ్యాన . తన పారితోషికాన్ని భారీగా పెంచేసిన సంగతి తెలిసిందే. జీయస్టీతో కలిపి ఒకో చిత్రానికి రూ. 16 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. ఇప్పుడు నేచురల్ స్టార్ నానీ కూడా తన పారితోషికాన్ని ఓ రేంజ్ లో పెంచేశాడట. గతంలో ఒకో సినిమాకి రూ. 10 లేదా 11 కోట్లు అందుకొనే నానీ.. ఇక పై రూ. 14 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికీ .. సినిమాల కోసం ఆ పారితోషికాన్ని అందుకుంటున్నాడట. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. మరి వీరిద్దరినీ చూసి .. ఇంకే హీరోలు తమ పారితోషికాలు పెంచేస్తారో చూడాలి.
Must Read ;- ‘శ్యామ్ సింగ రాయ్’ టీజర్ వదిలేది అప్పుడే.. !