మాటను నిలబెట్టుకోవడంలో సోనూ తర్వాతే ఎవరైనా. భారత దేశం అంతటా ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పుతానని ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నాన్ని సోనూ సూద్ చేస్తున్నారు. మొత్తం 18 ఆక్సిజన్ ప్లాంట్లను ఆయన ఏర్పాటు చేస్తున్నారు. కోవిడ్ మహమ్మారి బారి నుంచి ప్రజలను ఆదుకోడానికి ఆయన శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నారు. అవసరమైన వారికి ఇంటికే ఆక్జిజన్ సిలిండర్ అందేలా చేస్తున్నారు.
వివిధ రాష్ట్రాల్లో 18 ఆక్సిజన్ ప్లాంట్లను సోనూ ఏర్పాటుచేస్తున్నారు. కర్నూలు, నెల్లూరు నుంచి ఆయన ఈ ప్లాంట్లకు శ్రీకారం చుట్టారు. మంగుళూరులోనూ ప్లాంటు ఏర్పాటుచేయబోతున్నారు. త్వరలో తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, ఉత్తరాఖండ్, తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ లలో కూడా ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నారు ఈ విషయంపై సోనూ సూద్ మాట్లాడుత ఇటీవల కాలంలో మనమంతా ఆక్సిజన్ అందుబాటులో లేక ఇబ్బందులు పడ్డామన్నారు.
ఈ ఆక్సిజన్ సమస్యను దాని మూలాల నుంచి తొలగించడానికి మనం ఏం చేయాలో తన బృందంతో కలిసి తాను ఆలోచించానన్నారు. సాధ్యమైనంత ఎక్కువ ప్రదేశాల్లో మొత్తం ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పేద ప్రజలకు ఇవి ఉపయోగ పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆక్సిజన్ అందక ఒక్క వ్యక్తి కూడా చనిపోకూడదన్నదే తమ ఉద్ధేమని వివరించారు. ఈ కష్ట సమయంలో అందరూ కలిసి పేదవారికి చేయూతనివ్వాల్సిన అవసరముందన్నారు.
కరోనా మూడో వేవ్ ను ఎదుర్కోడానికి కూడా సిద్ధమవ్వాల్సిన అవసరముందన్నారు. ఇప్పుడు ఏర్పాటు చేయబోయే ప్లాంటు ఈ మూడో వేవ్ లో ఆక్సిజన్ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తుందన్నారు. పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించే ఆస్పత్రుల వద్దే ఈ ప్లాంట్లు ఏర్పాటుచేయడం జరుగుతుందన్నారు. ఇప్పుడు నెలకొల్పే ఈ ప్లాంట్లు రాబోయే సంవత్సరాలకు కూడా ఆక్సిజన్ అందిస్తూనే ఉంటాయన్నారు. ఇక ఆక్సిజన్ కొరతే తలెత్తదని చెప్పారు. వచ్చే నెల నుంచే ఈ ప్లాంట్లు పనిచేయడం ప్రారంభమవుతుందని వివరించారు.
Must Read ;- మీరే రియల్ హీరో.. కేటీఆర్,సోనూసూద్ పరస్పర ప్రశంసలు











