కొవిడ్, డెల్టా, గామా, డెల్టా ప్లస్… ఇప్పటివరకు మనకు తెలిసిన వైరస్ లు ఇవే. భవిష్యత్తులో ప్రపంచంపై మరిన్ని వైరస్ లు దాడి చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. కరోనా వేరియంట్ల స్థానంలో.. ఇప్పుడు ‘లాంబ్డా’ అనే పేరు వచ్చి చేరింది. ఇప్పటికే అనేక దేశాల్లో విస్తరిస్తున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ సైతం హెచ్చరికలు జారీ చేసింది. గతేడాది ఆగస్టులో వెలుగుచూసిన ఈ వేరియంట్.. 29 దేశాలకు విస్తరించింది. పెరు సహా చిలీ, ఈక్వెడార్, అర్జెంటినా లాంటి దేశాల్లో ‘లాంబ్డా’ కలకలం రేపుతుండటం ఆందోళన కలిగిస్తోంది. బ్రిటన్‌లో ఇప్పటి వరకు ఆరు కేసులు నమోదయ్యాయి.
కొత్త వేరియంట్ తో తీవ్ర ఇన్ఫెక్షన్
ఒక్కో వైరస్.. ఒక్కోవిధంగా ప్రభావం చూపుతుంది. అయితే ఈ ‘లాంబ్డా’ వైరస్ మాత్రం తీవ్ర ఇన్ఫెక్షన్ కు దారి తీస్తుందట. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవని పీహెచ్ఈ (పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్) పేర్కొంది. చిలీలో ఈ తరహా కేసులు వెలుగు చూశాయని, గత 60 రోజుల్లో ఈ కేసులు 32 శాతానికి పెరిగాయని తెలిపింది. లాంబ్డా వేరియంట్‌తో మరింత ఎక్కువ ప్రమాదం ఉందా? వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లపై తక్కువ ప్రభావం చూపుతుందా? అనడానికి ఇంకా ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. లాంబ్డాను అర్థం చేసుకోవడానికి ల్యాబ్ ల్లో పరీక్షలు జరుగుతున్నాయని తెలిపింది.
Must Read ;- తీవ్రత తక్కువే.. అక్టోబరు నాటికి థర్డ్ వేవ్ పీక్











