కళ్లున్నోడు ముందు మాత్రమే చూస్తాడు..ధిమాక్ వున్నోడు దునియా మొత్తం చూస్తాడు... ఇది మహేష్ బాబు రీల్ డైలాగ్ అయితే నారా లోకేష్ రియల్ యాక్షన్ సీన్ . కళ్లుండి గుడ్డివాడిలా జగన్‌రెడ్డి ఇంటికే పరిమితమైతే, దిమాక్ వున్న లోకేష్ దునియా మొత్తం చుట్టేస్తున్నాడు. మాట్లాడటం రాదని హేళన చేసిన వారికి తూటాల్లాంటి మాటలతో జవాబిచ్చాడు. తెలుగు తడబడతాడేమో కానీ.. హెచ్చరించడంలో అస్సలు పొరపాటు పడడని ప్రూవ్ చేసుకున్నాడు. 151 సీట్లు గెలిచి, నలుగురిని కొనుక్కున్న జగన్‌రెడ్డి, జనానికి భయపడి రెండేళ్లుగా తాడేపల్లి ఇంటి గేటు దాటి బయటకు రావడం లేదు. పార్టీ ఓడిపోయి, తానూ ఓడిపోయినా నారా లోకేష్ నిత్యమూ ప్రజల మధ్యే వుంటున్నాడు.
లాక్ డౌన్ టైములోనూ రాష్ట్రంలో పర్యటన
హైదరాబాద్‌లో వుండి మాట్లాడటం కాదంటూ, రోజూ బీరాలు పలికే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా లాక్ డౌన్ టైములోనూ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో నారా లోకేష్ పర్యటించిన సంగతి మరిచిపోతే ఎలా? అకాల వర్షాలకు నష్టపోయిన రైతుల్ని పరామర్శించాడు. వైసీపీ గూండాల కత్తులకు బలైన టిడిపి నేతలు, కార్యకర్తల కుటుంబాల కన్నీళ్లు తుడిచి అండగా నేనున్నానంటూ భరోసా నిస్తున్నాడు. జూమ్‌లోనే కనిపిస్తాడని వైసీపీ మంత్రులు పదే పదే దెప్పిపొడిచినా నారా లోకేష్ విశాఖ, కర్నూలు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, విజయవాడ, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో కరోనా సమయంలోనూ పర్యటించారు. జూమ్‌లో సమీక్షలు, నేరుగా పరామర్శలు, విద్యార్థుల తరఫున పోరాటం, కార్యకర్తలకు అండగా నిలిచే కార్యక్రమాలు, కోవిడ్ సమయంలో వేలాది మందికి వైద్య సాయం ..ఇవ్వన్నీ ఒంటిచేత్తో తన యంత్రాంగం సహకారంతో చేయించిన మొండోడు, మొనగాడు, మగాడు నారా లోకేష్. టిడిపి కార్యకర్తల్ని ఎక్కడ అక్రమంగా అరెస్ట్ చేసినా వారిని బెయిల్‌పై తీసుకొచ్చి ఇంట్లో దింపేవరకూ ఫాలో అప్ చేస్తున్నదే నారా లోకేషే. వారికి ఫోన్ ద్వారా నేనున్నానంటూ అభయమిచ్చేది లోకేష్.
ట్విట్టర్ స్పేస్‌లో గంటన్నరపైగా..
ఇంతటి బిజీ షెడ్యూల్‌లోనూ అభిమానులు, టిడిపి హితులతో ట్విట్టర్ స్పేస్‌లో గంటన్నరపైగా మాట్లాడారు. వందలాది మందితో ఇంటరాక్ట్ అయ్యారు. తగ్గేదేలేదంటూ ..భరోసానిచ్చారు. జగన్‌రెడ్డి ఓ ఫ్యాక్షనిస్టని, తాను చేసిన నేరాలు-ఘోరాలతో భయం, భయంగా గడుపుతాడని..మనం గట్టిగా వుంటే తోకముడుస్తాడని యూత్ లీడర్ లోకేష్ ..కేడర్‌కి ధైర్యం నూరిపోశారు. అర్ధరాత్రి కూడా నా ఫోన్ ఆన్‌లోనే వుంటుంది.. ఎప్పుడు, ఎవ్వరికీ ఏ సహాయం కావాలన్నా నన్ను అడగండి అంటూ అభిమానులకు భరోసానిచ్చారు. ట్విట్టర్ స్పేస్‌కి లోకేష్ వస్తున్నారని తెలిసి 1864 మంది కనెక్ట్ అయ్యారు. వీరిలో విదేశాలలోని తెలుగువారూ వున్నారు. వివిధ అంశాలపై అనర్గళంగా 2 గంటలు నారా లోకేష్ మాట్లాడటం ప్రత్యక్షంగా విన్న ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇంటలెక్చువల్స్ కూడా జీడీపీ, డెవలప్‌మెంట్, ఏపీలో అప్పుల పరిస్థితి, సంస్కరణల పేరిట జరుగుతున్న అంశాలపై లోకేష్‌తో సుదీర్ఘంగా చర్చించారు. ట్విట్టర్ స్పేస్‌లో దళితులపై పెరిగిన దాడులు, ఫ్యాక్షనిజం, సోషల్ మీడియా వంటి విషయాలపై అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా జవాబులు ఇచ్చారు.
అన్ని అంశాలపై క్లారిటీ
సబ్జెక్టు ఏదైనా, అడిగినది ఎవరైనా అందరికీ అన్ని అంశాలపై క్లారిటీ ఇచ్చారు. ట్విట్టర్ స్పేస్ ముగిసిన తరువాత న్యూట్రల్స్, జనసైనికులు కూడా మంచి అవగాహన కమాండింగ్‌తో నారా లోకేష్ మాట్లాడారని ప్రశంసిస్తూ ట్వీట్లు పెట్టారు. టిడిపి ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో తమ తోటి మిత్రులను ఊరిస్తూ లోకేష్ అన్న స్పేస్‌లో మంచి బూస్ట్ ఇచ్చారు మాకు, మీరు మిస్సయ్యారంటూ పోస్టులు ట్యాగ్ చేశారు. చివరికి పేటీఎం వైసీపీ విభాగం కూడా లోకేష్ ట్విట్టర్ స్పేస్ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయడానికి జాయినయ్యారు. ప్రత్యర్థులకు లోకేష్ ఇచ్చిన వార్నింగ్‌లు, అభిమానులకు నేనున్నానంటూ ఇచ్చిన భరోసాతో వారు స్పేస్ నుంచి జారుకుని రిపోర్టులు కొట్టీ కొట్టీ అలిసిపోయారు. ఓవరాల్‌గా తొలిసారిగా ట్విట్టర్ స్పేస్‌కొచ్చిన నారా లోకేష్ అందరి అభిమానం చూరగొన్నారు.
Must Read ;- నారా లోకేశ్.. ద లీడర్!











