కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో అమెరికా శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. ఏ రకం వేరియంట్లనైనా సమర్థంగా ఎదుర్కునే వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్నారు. అమెరికాలోని నార్త్ కరోలినా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్‌ను తయారు చేశారు. జంతువుల నుంచి మానవులకు సోకే ఏ రకమైన వైరస్‌ను అయినా సమర్థంగా ఎదుర్కొనే వ్యాక్సిన్‌ను రూపొందించారు. ఎలుకలపై నిర్వహించిన పరిశోధనల్లో ఈ వ్యాక్సిన్ మంచి ఫలితాలను ఇచ్చినట్లు వెల్లడయ్యింది. అన్ని రకాల వేరియంట్లను ఎదుర్కొనేలా యాంటీబాడీలు ఉత్పత్తి జరిగి రోగ నిరోధక శక్తిని పెంచుతున్నట్లు శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది.
మారుతున్న వేరియంట్లు..
కరోనా వైరస్ మహమ్మారి మానవులను కబలించటం మెదలు పెట్టినప్పటి నుంచి రకరకాలుగా రూపొంతరం చెందుతోంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో రకరకాల వైరస్‌లు బయట పడుతూ ప్రాణాంతకంగా మారుతున్నాయి. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు కొన్ని రకాల వైరస్‌లనే ప్రభావవంతంగా ఎదుర్కొంటున్నాయి. అంతేకాకుండా వైరస్ రకాలను బట్టి కూడ కరోనా సోకిన వారికి వైద్యం చేయడటంలో కూడ ఇబ్బందులు ఎదురువుతున్నాయి. మన దేశంలోని పరిస్థితినే గమనిస్తే కరోనా మొదటి వేవ్ కంటే రెండో వేవ్ ప్రమాదకరంగా ఉండి ఎక్కువ మంది దాని బారిన పడి మృత్తువాత పడ్డారు.
కరోనా బయట పడినప్పటి నుండి వ్యాక్సిన్ల అభివృద్ధికి ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. మానవులపై ప్రయోగాల్లో కూడ అమెరికా శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ వ్యాక్సిన్ మంచి ఫలితాలను ఇస్తే కరోనా పాలిట దీనిని సంజీవనిగానే పేర్కొనవచ్చు.
Must Read ;- కొవిడ్ డెల్టా ప్లస్.. మరో కొత్త వేరియంట్ టెన్షన్











