దర్శకుడు, నటుడు కాశీ విశ్వనాథ్ తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ అసోసియేషన్ కు నవంబరు 14న ఎన్నికలు జరిగాయి. అధ్యక్ష పదవికి ముగ్గురు పోటీ పడగా వై. కాశీ విశ్వనాథ్ గెలుపొందారు. అలాగే ఉపాధ్యక్ష పదవికి ఆరుగురు పోటీపడ్డారు. వారిలో దర్శకుడు మేర్లపాక గాంధీ, జి.ఎస్. రావు ఉపాధ్యక్షులుగా ఎంపికయ్యారు. ఇక ప్రధాన కార్యదర్శి పదవికి నలుగురు పోటీ పడగా దర్శకుడు వి.ఎన్. ఆదిత్య గెలుపొందారు.
ఎన్నికైన అనంతరం తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ను నూతన కమిటీ కలిసింది. మాజీ అధ్యక్షుడు ఎన్. శంకర్ నుంచి కాశీ విశ్వనాథ్ బాధ్యతలు స్వీకరించారు. కోశాధికారిగా భాస్కర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా కృష్ణమోహన్, పెండ్యాల రామారావు, కార్యనిర్వహణ కార్యదర్శులుగా కొల్లి రాంగోపాల్, దొండపాటి వంశీ కృష్ణ బాధ్యతలు చేపట్టారు.
కార్యవర్గ సభ్యులుగా గుంటూరు అంజిబాబు, అల్లా భక్ష్, పీవీ రమేశ్ రెడ్డి, కాటూరి రాఘవ, ఇ. ప్రేమ్ రాజ్. నీలం సాయిరాజేష్, ఎం. సాయి సురేంద్రబాబు, కూరపాటి రామారావు బాధ్యతలు స్వీకరించిన వారిలో ఉన్నారు. మహిళల రిజర్వేషన్ కోటాలో సౌజన్య, ప్రవీణలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సభ్యుల సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తామని అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్ అన్నారు. సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే స్పందిస్తామని హామీ ఇచ్చారు. తమ మీద నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పిగించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
Must Read ;- ‘తగ్గేదేలే’ అంటూనే తగ్గిన ‘పుష్ప’రాజ్











