జగన్ చర్యలు.. పురుడుపోసుకుంటున్న విభజన భావం !
మూడు రాజధానుల వాదన నినాదంగా మార్చుకుని మరి అసెంబ్లీలో సీఆర్డీఏ, మూడు రాజధానుల బిల్లు వెనక్కి అంటునే.. సమగ్ర, మెరుగైనా మూడు రాజధానుల బిల్లుతో మళ్లీ సభ ముందుకు తీసుకొస్తామని జగన్ రెడ్డి తన మనసులో మాటను బయటపెట్టాడు. అప్పటివరకైనా రాజధాని అమరావతి అని మాత్రం ఆయన ఒప్పుకోలేదు. దీనిని బట్టి చూస్తే.. ప్రజల్లో తీవ్ర విభజన భావాన్ని ముఖ్యమంత్రి స్ధాయి వ్యక్తే ప్రేరేపిస్తున్నారనండలో ఎటువంటి అతిశయోక్తిలేదని భువనేశ్వరి పీఠం పీఠాధిపతి కమలానంద భారతి స్వామీజీ విచారం వ్యక్తం చేశారు. ఇలా ప్రాంతాల విభజన పేరుతో చేసే రాజకీయాలు.. చివరికి ప్రజల్లో భేద భావనను పెంచి మూడు రాష్ట్రాల విభజనకు కూడా దారి తీసిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. మూడు రాజధానుల ఏర్పాటు విషయం దేశ సమగ్రత, సమైక్యతకు విఘాతమని ఆయన చెప్పారు. రాష్ట్రానికి రాజధాని ఒకటే ఉండాలని, అది రాజకీయ పార్టీలకు అతీతంగా ఉండాలని సూచించారు. ఇప్పటికైనా మూడు రాజధానుల అంశాన్ని పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధికి జగన్ బాటలు వేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వాలు, పార్టీలు తాత్కాలికమేనని రాజధాని శాశ్వతమని గుర్తుంచుకోవాలని బీజేపీ నాయకురాలు సాధినేని యామినీ శర్మ చెప్పారు. బీజేపీ ఏపి రాజధానికి కట్టుబడి ఉందని ఆమె ఉద్ఘాటించారు.
Must Read ;- రాజధాని అమరావతికి జైకొట్టిన అధికారపార్టీ ఎమ్మెల్యే..! తత్వం బోధపడేనా?











