నిజామాబాద్ రైతులు మరోసారి రోడ్డెక్కారు. నిజామాబాద్-కరీంనగర్ జిల్లాలకు చెందిన పసుపు పంట రైతులు నాగపూర్ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. పసుపు బోర్టు ఏర్పాటు చేయాలని, మద్దతు ధరల విషయంలో స్పష్టత ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. వాటితోపాటు మరో 4 డిమాండ్లను పరిశీలించాల్సిందిగా పసుపు రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ డిమాండ్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి ఈ నెల 20 వరకు సమయమిస్తున్నట్లు రైతులు తెలిపారు. ఒకవేళ అప్పటిలోగా సర్కార్ స్పందించకపోతే రైతుల ఆందోళనకు సంబంధించిన కార్యాచరణ ప్రకటిస్తామని రైతులు తెలియజేశారు.
నాగపూర్ 44వ జాతీయ రహదారిపై బైఠాయించిన రైతులపై పోలీసులు లాఠీచార్జి చేసి, గాల్లోకి కాల్పులు జరిపి పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించారు. రైతుల ఆందోళనకు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు మద్దతు తెలిపారు. ఆయన కూడా రైతులతోపాటు దర్నాలో పాల్గొన్నారు. పసుపు పంటకు కనీస మద్దతు ధర 15 వేలు ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ధర్మపురి అరవింద్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ విస్మరించారని రైతులు ఆరోపించారు.
Must Read ;- పట్టు సడలుతోంది.. కవితమ్మ ఇలాకాలో టీఆర్ఎస్‌కు భారీ షాక్