యాక్షన్ హీరో గోపీచంద్ – డైరెక్టర్ తేజ కాంబినేషన్ లో ‘అలివేలు వెంకటరమణ’ అనే చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన నటించేందుకు తాప్సీని ఫిక్స్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. ఆతర్వాత ఏమైందో ఏమో కానీ.. తేజ ఈ సినిమా కోసం కధానాయికను అన్వేషణ ఆరంభించారు. ‘ఫిదా’ బ్యూటీ సాయిపల్లవి అయితే.. క్యారెక్టర్ కి కరెక్ట్ గా సెట్ అవుతుందని తేజ ఆమెను సంప్రదించారని తెలిసింది.
అయితే.. సాయి పల్లవి చెప్పిన రెమ్యూనరేషన్ విని తేజ షాక్ అయ్యారట. సాయిపల్లవి తన నేచురల్ యాక్టింగ్ తో బాగా పాపులర్ అయ్యింది. ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ‘ఫిదా, మిడిల్ క్లాస్ అబ్బాయ్’ సినిమాల టైమ్ లో 80 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుంది. అయితే.. తేజ ‘అలివేలు వెంకటరమణ’ సినిమాలో గోపీచంద్ సరసన నటించేందుకు 1 కోటి 50 లక్షలు రెమ్యూనరేషన్ అని చెప్పిందట.
సాయిపల్లవి ఇలా చెప్పడంతో తేజ షాక్ అయి ఆలోచనలో పడ్డారట. సాయిపల్లవి అడిగినంత ఇస్తారో.. లేక వేరే హీరోయిన్ ని తీసుకుంటారో అనేది ఆసక్తిగా మారింది. గోపీచంద్ కి ఇది ఒక స్పెషల్ ఫిల్మ్ అని చెప్పచ్చు. సరైన సక్సస్ లేక కెరీర్ లో బాగా వెనకబడిన గోపీచంద్ ఈసారి ఎలాగైనా సరే సక్సస్ సాధించాలని తపిస్తున్నారు. మరి.. ఈ సినిమా అయినా గోపీచంద్ కి విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.
Must Read ;- గోపీచంద్ సరసన ‘ఫిదా’ బ్యూటీ.. నిజమేనా.?