‘ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్, హిట్’ లాంటి మూవీస్ తో మాస్ కా దాస్ అనిపించుకున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. ఇప్పుడు ‘పాగల్’ అనే మూవీలో నటిస్తున్నాడు. పూరీ, రవితేజ సూపర్ మూవీ ‘ఇడియట్’ ని పోలిన కథతో నరేశ్ కుప్పిలి తెరకెక్కిస్తున్న ఈ యూత్ ఫుల్ యాక్షన్ మూవీ మే 1న విడుదల కాబోతోంది. దిల్ రాజు సమర్ఫణలో శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్, లక్కీమీడియా బ్యానర్ లో బెక్కం వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా లో సిమ్రాన్ చౌదరి, మేఘాలేఖ కథానాయికలు గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నివేదా పేతురాజ్ ను ఖాయం చేస్తూ.. మేకర్స్ ట్విట్టర్ లో ప్రకటించారు.
తీర అనే పాత్రను నివేదా పెతురాజ్ చేస్తున్నట్టుగా నిర్మాతలు ఒక ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేసి మరీ తెలిపారు. అందులో విశ్వక్ సేన్ రెండు చేతుల్ని వెనక్కి కట్టేసి .. అతడ్ని కౌగిలించుకొనే పోజుతో నివేదా పెతురాజ్ .. కుర్రకారును బాగానే రెచ్చగొడుతోంది. దీన్ని బట్టి చూస్తే.. పాగల్ సినిమాకి నివేదాపెతురాజ్ పాత్ర బాగానే గ్లామర్ ను యాడ్ చేస్తుందని అర్ధమవుతోంది. మరి పాగల్ సినిమా లో నివేదా పెతురాజ్ .. ఏ మేరకు హైలైట్ అవుతుందో చూడాలి.
Must Read ;- దుమ్మురేపేస్తున్న పాగల్ టీజర్
Introducing the talented and ravishing @Nivetha_Tweets as Theera from #Paagal 😍#PAAGAL in THEATRES on MAY 1st 💥#PaagalOnMay1st @VishwakSenActor@SVC_official @NaresshLee @maniDop @radhanmusic @Garrybh88 @BekkemVenugopal @luckymediaoff #VS5 @AdityaMusic pic.twitter.com/dCfw1uPx44
— Sri Venkateswara Creations (@SVC_official) March 18, 2021