నివేథా పేతురాజ్.. ఇటీవల ఎనర్జిటిక్ హీరో రామ్ తో కలిసి రెడ్ అనే సినిమాలో నటించింది. కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. స్రవంతి మూవీస్ బ్యానర్ లో స్రవంతి రవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో ఆమె పోలీసాఫీర్ గా నటించింది. అయితే.. ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకుంది కానీ.. సంక్రాంతికి వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేదు. ఇప్పుడు నివేథా పేతురాజ్ ఆశలు అన్నీ పాగల్ మూవీ పైనే. ఇందులో విశ్వక్ సేన్, నివేథా పేతురాజ్ జంటగా నటించారు.

విశ్వక్ సేన్ ఫలక్ నామాదాస్ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమాతో విశ్వక్ యూత్ కి బాగా దగ్గరయ్యాడు. దాంతో విశ్వక్ సేన్ తో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇదిల ఉంటే.. విశ్వక్ సేన్ సినిమాల్లో కిస్ సీన్ తప్పకుండా ఉంటుంది. అలాగే పాగల్ మూవీలో కూడా కిస్ సీన్ ఉందట. ఈ సీన్ గురించి చెప్పినప్పుడు నివేథా పేతురాజ్ ఒప్పుకోలేదట. ఆఖరికి అయిష్టంగానే ఈ సీన్ కి ఒప్పుకుందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.
ఆమె ఇప్పటి వరకు తను నటించిన సినిమాల్లో ఇలాంటి సీన్ లో నటించలేదు. ఫస్ట్ టైమ్ కిస్ సీన్ లో నటించింది. పర్ ఫార్మెన్స్ స్కోప్ ఉన్న పాత్రలనే కాకుండా గ్లామర్ రోల్స్ చేయడానికి కూడా రెడీ అన్నట్టుగా ఈ సినిమాలో నటించిందని.. పాగల్ తర్వాత నివేథాకు మరిన్ని అవకాశాలు వస్తాయని అంటున్నారు. పాగల్ ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. అలాగే డైరెక్టర్ చందూ మొండేటి డైరెక్షన్ లో ఓ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది. మరి.. నివేథా కి పాగల్ ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
Must Read ;- జోడు గుర్రాలపై జోరుమీదున్న బ్యూటీ











