ఫలక్నామా దాస్ సినిమాతో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘పాగల్’ అనే సినిమా నటిస్తున్నాడు. ఈ సినిమాకు కుప్పిలి సురేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. పాగల్ సినిమా షూటింగ్ ఈమధ్యనే ప్రారంభం అయ్యింది. శరవేగంగా షూటింగ్ జరుగుతున్నా ఇప్పటి వరకు హీరోయిన్ ను ఫైనల్ చేయలేదు దర్శకుడు. ఇప్పటికే అనేకమంది హీరోయిన్లను పరిశీలించిన దర్శకనిర్మాతలు చివరికి నివేథ పేతురాజ్ కు ఓటు వేశారు.
ఈమధ్యనే సినిమా కథను హీరోయిన్ నివేథ పేతురాజ్ కు దర్శకుడు చెప్పాడని, తను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే మంచి యాక్టర్ గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ‘పాగల్’ సినిమా ద్వారా యాక్టర్ గా మరో మెట్టు ఎక్కుతుందని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. త్వరలోనే నివేథ పేతురాజ్ ‘పాగల్’ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతుందని సమాచారం. ఈ సినిమాకు ‘అర్జున్ రెడ్డి’ ఫెమ్ రాధన్ సంగీతం అందిస్తున్నాడు.
ఇక ‘హిట్’ సినిమాతో మంచి హిట్ అందుకున్న యువ హీరో విశ్వక్ సేన్ తన తదుపరి సినిమా ‘పాగల్’ కావడంతో టాలీవుడ్ లో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. పాగల్ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాల కథలను ఓకే చేసాడు హీరో విశ్వక్ సేన్. ఆ రెండు సినిమాలకు సంబంధించిన విషయాలను త్వరలోనే వెల్లడిస్తారని తెలుస్తోంది. ‘హిట్’ సినిమా విజయంతో మంచి ఫాంలో ఉన్న విశ్వక్ సేన్ ‘పాగల్’ సినిమాతో మరో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి మరి.
AlsoREAD ;- టాలీవుడ్‌పై శివాలెత్తిన హాట్ బాంబ్ శ్రీ రెడ్డి