Nivetha Thomas Fans Worried About Her Script Selections :
నాని ‘జెంటిల్ మేన్’ సినిమా ద్వారా నివేదా థామస్ పరిచయమైంది. తొలి సినిమాలోనే ఎక్కడా తడబాటు లేకుండా మెప్పించింది. కాస్త హైటు తక్కువైనా ఆకర్షణ ఎక్కువే అనుకునేలా చేసింది. కళ్లతోనే హావభావాలను చక్కగా పలికించగలదని అనిపించుకుంది. స్కిన్ షో చేయకుండా నటనకు అవకాశం కలిగిన పాత్రలను మాత్రమే చేస్తూ వెళ్లింది. సాధారణంగా తొలి సినిమాతో హిట్ దక్కడమే చాలా కష్టమైన విషయం. అలాంటిది నివేదా వరుసగా భారీ విజయాలను అందుకుంటూ వెళ్లింది. చాలా తక్కువ సమయంలోనే ఎన్టీఆర్ సరసన కూడా మెప్పించింది.
అయితే ‘బ్రోచేవారెవరురా‘ సినిమా హిట్ తరువాత నివేదా థామస్ సరైన సినిమా చేయలేకపోయింది. నానీతో రెండు హిట్లు ఉన్నప్పటికీ, ఆయనతో చేసిన ‘వి’ సినిమా ఆమె కెరియర్ ను గాడిలో పెట్టలేకపోయింది. ఇటీవల నివేద చేసిన ‘వకీల్ సాబ్’ కూడా సంచలన విజయాన్ని నమోదు చేసింది .. భారీ వసూళ్లను రాబట్టింది. అయితే ఈ విజయాన్ని ఆమె ఒక్క ఖాతాలోనే జమ చేయలేం. ఇలాంటి పరిస్థితుల్లోనే నివేద ‘శాకినీ .. ఢాకినీ’ అనే సినిమా చేస్తోంది. ‘మిడ్ నైట్ రన్నర్స్’ అనే కొరియన్ సినిమాకి ఇది రీమేక్. ఈ సినిమాలో రెజీనాతో కలిసి ఆమె నటిస్తోంది.
ఇది నాయిక ప్రధానంగా నడిచే కథ. ఇందులో నివేద యాక్షన్ సీన్స్ లోను కనిపించనుంది. ఈ విషయంలోనే ఆమె అభిమానులు టెన్షన్ పడుతున్నారు. సాధారణంగా ఈ తరహా పాత్రలు ఒకసారి చేస్తే, మళ్లీ అలాంటి అవకాశాలే వస్తుంటాయి. అంటే హీరోల సరసన ఆడిపాడే అవకాశాలు తగ్గుతూ పోతాయనేది వాళ్ల ఆలోచన. కెరియర్ కాస్త నెమ్మదించిన తరువాత హీరోయిన్లు ఈ తరహా జోనర్ వైపు అడుగులు వేస్తుంటారు. అలాంటిది నివేద కంగారుపడిపోయి అప్పుడే ఆ దిశగా వెళ్లడం అభిమానులను కలవరపెడుతోంది.
Also Read : దగ్గుబాటి అభిరామ్ సరసన మహేష్ హీరోయిన్ సిస్టర్?