కన్నబిడ్డలు బాధ ఏమాత్రం లేదు.. వారిని హత్య చేశామనే భావన ఆమెలో ఏ మూల కూడా కాన రావడం లేదు. పైగా పెచ్చురిల్లిన మూర్ఖత్వంతో ప్రవర్తిస్తూ అటు పోలీసులకు, ఆరోగ్య పరీక్షలు చేయడానికి వచ్చిన సిబ్బందిని ముప్పతిప్పలు పెడుతుంది పద్మజ. జైలు వెళ్లాక కూడా అవే కేకలు, అరుపులు. తన ఆరోగ్య పరిస్థితి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మదనపల్లెలో జరిగిన జంట హత్యల కేసు రాష్ట్రంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ హత్యల్లో నిందులైన తల్లిదండ్రలు పురుషోత్తం, పద్మజలను పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో కూడా పద్మజ, ఏదో ట్రాన్స్‌లో ఉన్న మనిషిలా చేతులు అటు, ఇటు ఆడిస్తూ పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగింది. పిల్లల ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడం వల్లే మంత్రగాళ్లతో పూజలు చేయించునట్టు పురుషోత్తం పోలీసులకు వివరించారు. కానీ తల్లి పద్మజ మాత్రం అవి హత్యలు కాదని, వారికి సద్గతులు ప్రాప్తించాయని పిచ్చి పిచ్చిగా అరుస్తూ పోలీసులతో గొడవకు దిగింది.
అరెస్టు చేసిన అనంతరం కరోనా టెస్ట్‌ల కోసం వారిరువురిని తరలించగా.. అక్కడ కూడా పద్మజ తానే శివుడినని.. శివుడికే కరోనా పరీక్షలా అంటూ వైద్య సిబ్బందిపై విరుచుకుపడింది. కరోనా తన నుండే పుట్టిందని, ఏ వ్యాక్సినేషన్లతో పనిలేకుండా మార్చి నాటి కల్లా కరోనాను అంతం చేస్తానని అందరిపై కోపంతో ఊగిపోయింది. తనకు నచ్చజెప్పడానికి ప్రయత్నించిన భర్తపై ‘తనలో శివుడున్నాడని.. నన్ను నియంత్రించడానికి ప్రయత్నించవద్దని అరడంతో’ అక్కడి వారు ఆశ్చర్యపోయారు. చివరికి కరోనా పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. 14 రోజుల రిమాండుపై జైలుకు తరలించగా పద్మజను ప్రత్యేక గదిలో ఉంచారు. అక్కడ కూడా అరుపులు, కేకలు వేస్తూ.. అధికారులను హడలెత్తించిందని సమాచారం.
Must Read ;- చంపేసి, నోట్లో రాగిచెంబులు పెడ్తే.. రేపు ఉదయం లేస్తారా?











