పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో ఓ భారీ పిరియాడిక్ మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి విరూపాక్షి అనే టైటిల్ ఖరారు చేశారని వార్తలు వచ్చాయి. ఈ టైటిల్ తో పాటు దొంగ, వజ్రాల దొంగ, మంచి దొంగ.. ఇలా కొన్ని టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. అయితే.. ఇప్పుడు ఈ టైటిల్స్ కాకుండా వీరమల్లు అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నారని తెలిసింది.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర పేరు వీరమల్లు. అందుకే పాత్ర పేరునే టైటిల్ గా పెట్టాలనుకుంటున్నారట మేకర్స్. అయితే.. పవర్ ఫుల్ గా ఉండడం కోసం హరహర వీరమల్లు టైటిల్ పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి ఇది వర్కింగ్ టైటిల్ మాత్రమే. ఈ టైటిల్ తో పాటు మరో రెండు టైటిల్స్ కూడా అనుకుంటున్నారు. వీరమల్లు టైటిల్ కి పవన్ ఇంకా ఓకే చెప్పలేదు. షూటింగ్ విషయానికి వస్తే.. ఇప్పటి వరకుఈ సినిమాకి సంబంధించి మూడు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయ్యింది.
ప్రస్తుతం పవన్ అయ్యప్పనున్ కోషియమ్ రీమేక్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. త్వరలో ఈ షూటింగ్ గ్యాప్ ఇచ్చి క్రిష్ కి డేట్స్ ఇవ్వనున్నారని సమాచారం. స్వరవాణి కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ భారీ పిరియాడిక్ మూవీని సీనియర్ ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. మరి.. పవన్ వీరమల్లు టైటిల్ కి ఓకే చెబుతారో.. లేక వేరే టైటిల్ ఫిక్స్ చేస్తారో చూడాలి.
Must Read ;- పవన్ తో ఫస్ట్ డే షూటింగ్ అద్భుతం అంటున్న రానా