పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ‘వకీల్ సాబ్’ తో రీ ఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ ఆతర్వాత కొంత గ్యాప్ తీసుకుని తదుపరి సినిమా చేస్తారనుకున్నారు. అయితే.. ఎలాంటి గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు అనౌన్స్ చేసి సర్ ఫ్రైజ్ చేశారు. ‘వకీల్ సాబ్’ తర్వాత క్రిష్ తో సినిమా చేయనున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. దాదాపు 100 కోట్లు బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

అయితే.. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ తో మూవీ, సురేందర్ రెడ్డితో మూవీ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాలతో పాటు లిస్ట్ లో లేని ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ కి ఓకే చెప్పారు. ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకుడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జనవరి నుంచి స్టార్ట్ చేసి సింగిల్ షెడ్యూల్ కంప్లీట్ చేయాలనేది ప్లాన్. ఇందులో పవర్ స్టార్ తో పాటు మరో హీరోగా దగ్గుబాటి రానా నటించనున్నారు.
ఈ సినిమాకి జనవరి నుంచి డేట్స్ ఇవ్వనున్నారని తెలిసినప్పటి నుంచి క్రిష్ మూవీ ఉందా.? లేదా.? అనే అనుమానాలు మొదలయ్యాయి. అంతే కాకుండా.. క్రిష్ మూవీని ఆపేశారంటూ వార్తలు కూడా వచ్చాయి. ఇంతకీ విషయం ఏంటంటే.. వకీల్ సాబ్ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత క్రిష్ మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతారట. ప్రస్తుతం క్రిష్ ఈ సినిమాకి సంబంధించి కొన్ని సీన్స్ ని రీరైట్ చేస్తున్నారని తెలిసింది. ఈ పిరియాడిక్ మూవీకి స్వరవాణి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Must Read ;- మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా సందడి చేయనున్న పవర్ స్టార్











