పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’ విడుదల ఒక్కరోజులోకి వచ్చేసింది. అభిమానులు ఆ ఒక్క రోజు ఎప్పుడు గడుస్తుందా? రేపు వేసే ఫష్ట్ షో కి ఎప్పుడు వెళ్ళిపోదామా అనే ఆత్రుతతో ఉన్నారు. దాదాపు మూడేళ్ళ గ్యాప్ తర్వాత పవర్ స్టార్ మళ్ళీ స్ర్కీన్ మీద కనిపించబోయే సినిమా కావడంతో.. ‘విపరీతమైన హైప్ ఏర్పడింది. దీనికి తోడు ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా ఉండడంతో .. ఈ సినిమా బద్దలు కొట్టే రికార్డులు మామూలుగా ఉండవని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.
అలాంటి ‘వకీల్ సాబ్’ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ రూమర్ ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే. ఈ సినిమా సెకండాఫ్ లో పవన్ అభిమానులకు ఓ అదిరిపోయే సర్ ప్రైజ్ ఇవ్వనున్నాడట దర్శకుడు. మొన్నటి నుంచి ఈ వార్త వినిపిస్తున్నా.. అదేంటో తెలుసుకోవాలనే ఆసక్తిని చూపించడం లేదు అభిమానులు. కారణం సస్పెన్స్ పోతుందని. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. ‘వకీల్ సాబ్’ సినిమా ద్వితీయార్ధంలో పవన్ తనయుడు అకీరా నందన్ .. కొన్ని సెకండ్స్ కనిపిస్తాడట. అది కూడా తండ్రి తో స్ర్కీన్ షేర్ చేసుకొని.
పవర్ స్టార్ తనయుడు అకిరా నందన్ .. హీరోగా ఎంట్రీ ఎప్పుడిస్తాడు ? అనే ఆసక్తి అభిమానుల్లో ఎప్పటి నుంచో ఉంది. ఆ మధ్య దీని మీద ఒక వార్త వచ్చినా.. అది ఒట్టి రూమర్ గానే తెలింది. ఇప్పుడు ఈ విధంగా మరోసారి అకీరా నందన్ పేరు వినిపించడం టాలీవుడ్ లో విశేషంగా మారింది. మరి నిజంగానే వకీల్ సాబ్ లో అకిరా నందన్ కనిపిస్తాడా? లేదా అనే విషయం తేలాలంటే… రేపటి వరకూ ఆగాల్సిందే.
Must Read ;- ‘వకీల్ సాబ్’ తెరమీద 50 నిమిషాలే కనిపిస్తాడట