పూజా హెగ్డే ఇప్పుడు హాట్ భామగా అభిమానుల్లో ముద్ర వేసుకుంది. ‘రంగస్థలం’ సినిమాలో జిగేలు రాణిగా ఐటమ్ సాంగ్ లో అలరించినప్పటి నుంచి ఆయన అభిమానులు విపరీతంగా పెరిగిపోయారు. సోషల్ మీడియా వచ్చాక అభిమానులకు ఈ హీరోయిన్లు బాగా దగ్గరైపోయారు. ఏదైనా ప్రశ్న అడిగితే వెంటనే తమదైన శైలిలో స్పందించేస్తున్నారు. ఈ మధ్య ఓ నెటిజన్ ఆమెను ఓ కోరిక కోరాడు. అతనికి ఆమెను నగ్నంగా చూడాలని ఉందట. ఓ కోరిక వినగానే పూజ కూడా తనదైన శైలిలో అతనికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది.
దాంతో అతనికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. ఇన్ స్టాగ్రామ్ లో పూజ యాక్టివ్ గా ఉంటుంది. ఎవరైనా ఇలాంటి ప్రశ్నలకు అడిగితే వాటికి సమాధానాలు ఇవ్వరు. కానీ పూజ అలా చేయలేదు. అతని కోరికను మరో రకంగా తీర్చింది. తన పాదాలను ఫొటో తీసి చక్కగా పోస్ట్ చేసింది. ఏదో చూద్దామనుకున్న అభిమాని ఆమె పాదాలు చూసి షాక్ తిన్నాడు. ఇలాంటి సమయస్ఫూర్తి కొందరికి మాత్రమే ఉంటుంది.
వారిలో పూజ కూడా ఒకరనే అనుకోవాలి. ఈ అమ్మడికి తెలుగులో చాలా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఆ సినిమాల్లో బిజీగా ఉంది. అక్కినేని అఖిల్ తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ చేసింది. ఈ సినిమా జూన్ 19న విడుదల కాబోతోంది. ప్రభాస్ తో నటిస్తున్న ‘రాధేశ్యామ్’ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ‘ఆచార్య’లోనూ ఈ భామకు చోటు దక్కిందట. మొత్తానికి ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇస్తూనే ఉంది.
Must Read ;- చరణ్ .. పూజా హెగ్డే పాటేసుకోవడానికి మెలోడీ రెడీ!