కొరటాల తన సినిమాకి సంబంధించిన కథపై కసరత్తు చేస్తాడని అనడానికన్నా, తపస్సు చేస్తాడని అనడమే సరైనదిగా అనిపిస్తుంది. అంతగా ఆయన తాను అనుకున్న కథపై దృష్టిపెడతాడు. తన నుంచి ప్రేక్షకులు ఎలాంటి కథను ఆశిస్తున్నారు? తమ అభిమాన హీరోను ఎలాంటి పాత్రలో చూడాలనుకుంటున్నారు? మిగతా దర్శకులకు భిన్నంగా హీరోను తాను ఎంత కొత్తగా చూపించాలని అనుకుంటున్నాడు? తను నమ్మిన కథాకథనాలకు సంగీతం వైపు నుంచి ఎంత సపోర్ట్ లభిస్తుంది? వంటి అన్ని విషయాలను ఆయన పరిగణనలోకి తీసుకుంటారు.

ప్రస్తుతం ఆయన ‘ఆచార్య‘ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన నాయికగా కాజల్ అలరించనుంది. ఇక ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న చరణ్ ఇందులో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. ఈ పాత్రను కొరటాల డిజైన్ చేసిన తీరు చాలా కొత్తగా ఉంటుందని అంటున్నారు. ఆయన లుక్ కూడా డిఫరెంట్ గా ఉంటుందని చెబుతున్నారు. సినిమా మొత్తం మీద ఆయన ఓ అరగంట సేపు కనిపిస్తాడని అంటున్నారు. అసలే కత్తిలాంటి కుర్రాడు .. తెరపై ఏ తోడూ లేకుండా అంతసేపు ఎలా ఉంటాడు? అందుకే ఆయకో జోడీని సెట్ చేశారు.
Must Read:-మెగాస్టార్ చిరంజీవి‘వేదాళం’ మే నుంచి సెట్స్ పైకి
అవును .. చరణ్ జోడీగా పూజా హెగ్డేను తీసుకున్నారు. ముందుగా రష్మికను అనుకున్నప్పటికీ, చివరి నిమిషంలో పూజా హెగ్డే ఈ అవకాశాన్ని దక్కించుకుంది. చరణ్ సరసన పూజా హెగ్డేను చూడాలనుకుంటున్న మెగా అభిమానుల ముచ్చటను ఈ సినిమా తీర్చనుంది. ఇక అంతటి అందమైన అమ్మాయి పక్కనే ఉంటే పాటేసుకోకుండా ఎవరైనా ఉంటారా? అతగాడు ఊరుకున్నా ఫ్యాన్స్ ఊరుకుంటారా? అందుకే ఈ జోడీ ద్వారా ఊపును .. ఉత్సాహాన్ని పెంచడానికిగాను ఒక సాంగును కూడా సెట్ చేశారట. మణిశర్మ స్వరపరించిన మెలోడీ సాంగును ఈ జంటపై చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. ఈ పాట ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. మొత్తానికి ‘ఆచార్య’కి ఒక్కో మసాలా తోడవుతూ వస్తోందన్న మాట.
Must Read:-అదృష్టానికి కేరాఫ్ అడ్రెస్ పూజా హెగ్డే











