ప్రముఖ బ్రిటీష్ నటుడు మొదటి జేమ్స్ బాండ్ పాత్ర ధారి షాన్ కానరీ (90) కన్నుమూశారు. ఆయన మరణాన్ని యూకె మీడియా ధ్రువ పరిచింది. డాక్టర్ నో చిత్రంతో తొలి బాండ్ గా తెరమీద కనిపించిన ఆయన తొలి చిత్రంతోనే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.
మొత్తం 6 సినిమాల్లో బాండ్‌గా కనిపించారు షాన్ కానరీ.అలాగే ఆయన మరిన్ని బ్రిటన్ యాక్షన్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని మైమరిపింపచేశారు. అయితే ఎన్ని పాత్రలు చేసినా.. షాన్ కానరీ అభిమానులకు మాత్రం జేమ్స్ బాండ్ పాత్రే ఎవర్ గ్రీన్ . ఆయన మృతి ప్రపంచ సినీ పరిశ్రమకే తీరని లోటు.