పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత మళ్లీ సినిమాలు చేయరు అనుకున్నారు. అన్నయ్య చిరంజీవితో పాటు, అభిమానులు కూడా పవన్ ని సినిమాలు చేయాలని ఒత్తిడి చేయడం.. ఆఖరికి పవన్ సినిమా చేయడానికి ఓకే చెప్పడం తెలిసిందే. బాలీవుడ్ లో సక్సస్ సాధించిన ‘పింక్’ మూవీ రీమేక్ ‘వకీల్ సాబ్’ తో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రేజీ మూవీని టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు – బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తుండడం విశేషం. వేణుశ్రీరామ్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ‘వకీల్ సాబ్’ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

సంక్రాంతికి వస్తుంది అనుకున్నారు కానీ.. కొన్ని కారణాల వలన సంక్రాంతి రేసు నుంచి వకీల్ సాబ్ తప్పుకున్నాడు. ఇంతకీ వకీల్ సాబ్ అప్ డేట్ ఏంటంటే.. షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అఫిషియల్ గా ఎనౌన్స్ చేసింది. అంతే కాకుండా వర్కింగ్ స్టిల్స్ కూడా రిలీజ్ చేసింది. ఓ వైపు షూటింగ్ జరుగుతుండగానే మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసారు. కొత్త సంవత్సరం అలాగే సంక్రాంతి వస్తుండడంతో వకీల్ సాబ్ నుంచి క్రేజీ అప్ డేట్ వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే.. ఈ సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేయనున్నట్టు తెలిసింది కానీ.. రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ప్రకటించలేదు.
తాజా సమాచారం ప్రకారం.. వకీల్ సాబ్ మూవీని ఏప్రిల్ 9న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఫిబ్రవరిలో కరోనా వ్యాక్సిన్ వస్తుంది అంటున్నారు. ఆల్రెడీ వ్యాక్సిన్ పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. అందుచేత సమ్మర్ కి కరోనా కష్టాలు పోతాయి కనుక ఏప్రిల్ 9న రానున్న వకీల్ సాబ్ కి బాక్సాఫీస్ వద్ద భారీ విజయం ఖాయం అంటున్నారు సినీ పండితులు. మరి.. ఏ స్ధాయి విజయాన్ని సాధిస్తాడో చూడాలి.
Must Read ;- POLICE ను కొట్టడం ఇష్టంలేకే వకీల్‌సాబ్ అలా చేశారట











