పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ గా వస్తున్న ‘వకీల్ సాబ్’ సినిమా విశేషాలు గురించి అభిమానులు ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. పింక్ హిందీ సినిమా రీమేక్ గా వస్తున్న ‘ వకీల్ సాబ్ ‘ షూటింగ్ జరుగుతోంది . ప్రస్తుతం పవన్ కళ్యాణ్, శృతి హాసన్ ల మీద కీలకం అయిన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. డిసెంబర్ 22 వ తేదీ తో మొత్తం షూటింగ్ పూర్తీ అవుతుందని, వకీల్ సాబ్ సినిమా కి గుమ్మడి కాయ కొట్టేస్తున్నారని తెలుస్తుంది.
ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభ వార్త అనే చెప్పాలి . వేణు శ్రీ రామ్ డైరెక్షన్ లో దిల్ రాజు , బోనీ కపూర్ ఈ సినిమా నిర్మిస్తున్నారు . థమన్ సంగీత దర్శకుడు . వచ్చే ఏడాది వేసవి మొదటిలో ఈ సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Must Read ;- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసులన్నా క్రేజే?