పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ షూటింగ్ లో చోటు చేసుకున్న సన్నివేశం ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. వకీల్ సాబ్ సినిమాలోని ఓ సన్నివేశంలో పోలీసులకు విద్యార్థులకు మధ్య ఘర్షణ చోటు చేసుకునే సన్నివేశం షూటింగ్ కు అంతా రెడీ అయ్యారు. అయితే విద్యార్థులు పోలీసుల షీల్డ్ మీద కొడతారు. ఆ షీల్డ్ పై పోలీస్ అనే పెద్దపెద్ద అక్షరాలు రాసి ఉన్నాయి.
వాటిపై కొట్టడం అంటే పోలీసులను కొట్టినట్టేనని భావించిన పవన్ కళ్యాణ్ ఆ షీల్డుపై పోలీస్ అనే ఇంగ్లీషు అక్షరాలను స్వయంగా తొలగిస్తున్న ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. పోలీస్ శాఖపై తనకు ఉన్న గౌరవంతోనే ఇలా స్టిక్టర్ తీసేయాలని పవన్ నిర్ణయించడం విశేషం.
పోలీస్ శాఖకు మరింత గౌరవం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ సందర్భంగా తీసుకున్న ఈ నిర్ణయం పోలీసుల ఆత్మగౌరవం పెంచుతోందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అనేక సినిమాల్లో పోలీసు అధికారుల పాత్రలను అనేక మంది హీరోలు పోషించి ఆ శాఖ గౌరవం పెంచారు. కానీ ఆ శాఖలో ఉన్న లోపాలను కూడా సినిమా ఎత్తిచూపడం సహజం. ఏది ఏమైనా సినిమాల్లో పోలీసుల గౌరవం పెరిగే విధంగా చూపిస్తే, సమాజం కూడా వారిని గౌరవిస్తుందనడంలో సందేహం లేదు.
మొదటి నుంచీ…
పవన్ కళ్యాణ్ తండ్రి పోలీస్ గా కెరీర్ ప్రారంభించారు. ఆ తరవాత ఆయన ఉన్నత అధికారిగా ఎదిగారు. శాంతి, భద్రతల రక్షణలో పోలీసులు ఎంత కీలకమో చిన్నప్పటి నుంచీ పవన్ స్వయంగా ఇంట్లోనే చూస్తూ పెరిగారు. దీనికితోడు బాల్యం నుంచి క్రమశిక్షణతో పెరగడం కూడా పవన్ కు పోలీసులపై అభిమానం ఏర్పడింది. అందుకే పవన్ సినిమాల్లో ఎక్కడా పోలీసులను కించపరిచే సన్నివేశాలను ఆయన ఇష్టపడరంటారు. సమాజంపై సినిమా తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే పోలీసుల గౌరవం పెంచే విధంగానే పవన్ పోలీసు పాత్రలు వేస్తూ ఉంటారని సన్నిహితులు చెబుతుంటారు. ఏది ఏమైనా వకీల్ సాబ్ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Must Read ;- పవన్ పంచ్ : పేకాట క్లబ్బులు నడపడంలో ఉన్న శ్రద్ధ రోడ్లపై లేదు