వరుడు కావాలెను.. వధువు కావలెను.. సాధారణంగా ఇలాంటి ప్రకటనలు ఎవరి కోసం ఇస్తారు? ఏంటా ప్రశ్న.. పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్లు ఇస్తారు అని వెంటనే సమాధానం చెప్తారు. ఇంతకీ పెళ్లి మనిషికా.. శునకానికా అని ఎవరూ అడగరు.. ఏంటి వెటకారమా.. శునకాలు కూడా పెళ్లి చేసుకుంటాయా.. అదీ ఇలాంటి ప్రకటనలు ఇచ్చి మరీ.. ఎవరైనా ఇలాగే స్పందిస్తారు. కానీ, ఇది కలికాలం.. ఏదైనా జరగచ్చు.. గుర్రము ఎగరావచ్చు.. శునకము వధువు కోసం ప్రకటన విడుదల చేయచ్చు. నిజంగానే ఒక శునకం కోసం వారి కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా ఒక పెళ్లి ప్రపోజల్ విడుదల చేశారు. అది కాస్త నెట్టింట హల్ చల్ చేస్తుంది. మరి ఈ విచిత్రమైన ప్రకటన కథేంటో చూద్దాం రండి!
My girl is here, she’s from #Kashmir pic.twitter.com/BOFT9aGlbP
— Bisma (@ali_tenzu) January 22, 2021
మాలయాళీ సోగ్గాడు.. కాశ్మీర్ సోయగం..
ఓ మలయాళీ కుటుంబం పగ్‌కు (ఒకప్పుడు హచ్ డాగ్‌గా ఫేమస్ అయింది) చక్కగా జరీ అంచు పంచకట్టి, పింక్ కలర్ చొక్కాతో ముస్తాబు చేసి ఫేస్ బుక్ ఓ పోస్ట్ పెట్టారు. ‘మీ ఇంట్లో పెళ్లి కావాల్సిన అమ్మాయి ఎవరైనా ఉంటే.. మా ఇంటి అందగాడు సిద్ధంగా ఉన్నాడు’ అంటూ పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. దీన్ని మరొకరు తన ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. అంతేకాదండోయ్.. ఈ మలయాళీ సుందరాంగుడికి సంబంధాలు కూడా వస్తున్నారు. ఇప్పటికే కాశ్మీర్ వారు సంబంధం కోసం ట్వీట్ కూడా చేశారు. మరి పెళ్లి కుదురుతుందేమో చూడాలి.. కుదిరితే తొందరలో కాశ్మీర్ అమ్మాయి.. మలయాళీ వారి ఇంటి కోడలు అవుతుంది. మరి మీరు కూడా ఓ సారి జంటను చూసి మీ అభిప్రాయాన్ని చెప్పండి.
Must Read ;- పందులు, కుక్కలపై జగన్ సర్కారు కొత్త జీవో