పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి .. రీసెంట్ గా ‘అరణ్య’ సినిమాతో మిశ్రమ ఫలితాన్ని అందుకున్నారు. ఇక ‘విరాట పర్వం’ సినిమాతో ఈ నెల 30న రాబోతున్నారు. అలాగే.. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మలయాళ రీమేక్ లో నటిస్తున్నారు. ఇక రానా దీని తర్వాత ఓ పీరియాడికల్ మూవీలో నటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. 1940 ప్రాంతంలో .. అంటే దాదాపు 70 ఏళ్ళ క్రిందట జరిగిన కథతో ఈ సినిమా తెరకెక్కబోతోంది.
సుకుమార్ ప్రియ శిష్యుడు వెంకీ.. ఈ కథను రానాకి చెప్పాడట. రానాకి కథాంశం బాగా నచ్చడంతో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. రానా కమిట్ మెంట్స్ పూర్తయ్యాకా సినిమా సెట్స్ మీదకు వెళుతుందట. అలాగే.. ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందట.
నిజానికి రానా 1945 లో జరిగే కథతో ఇంతకు ముందు ‘మడై తిరందు’ అనే తమిళ సినిమాకి సైన్ చేశాడు. సత్యశివ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాను తెలుగులో 1945గా విడుదల చేయాలనుకున్నారు. అయితే ఈ సినిమా నిర్మాత రాజరాజన్ రానాకి అడ్వాన్స్ ఇవ్వకుండానే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశాడు. దాంతో ఈ ప్రొడ్యూసర్ ఫస్ట్ లుక్ పేరుతో మనీ రైజింగ్ కు పాల్పడి మోసం చేస్తున్నాడని ట్విట్టర్ వేదికగా రియాక్టయ్యాడు. దాంతో ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇప్పుడు మరోసారి 1940 ప్రాంతంలోని కథతో రానా సినిమా చేస్తుండడం విశేషంగా మారింది. మరి ఈ సినిమా రానాకి ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.
Must Read ;- 14 రీల్స్ బ్యానర్ లో రానా దగ్గుబాటి సినిమా?