ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ‘స్పెల్ బీ’ కాంటెస్ట్ గురించి అందరికీ తెలిసిందే. పిల్లల్లో ఇంగ్లీష్ స్కిల్స్ ను టెస్ట్ చేసేందుకు ఈ పోటీలు నిర్వహిస్తారు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ పోటీలకు సిద్ధం చేస్తూ, టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తుంటారు. అయితే ఈ ఏడాది స్పెల్ బీ పోటీల్లో ఓ నల్లజాతి బాలిక సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.
భారతీయ అమెరికన్లదే హవా
అమెరికాలో ప్రతి సంవత్సరం జరిగే ‘స్పెల్లింగ్ బీ’ పోటీలకు వేలాదిమంది పిల్లలు ఆసక్తి చూపుతుంటారు. ఈ ఏడాది జూలై 8న జరిగిన పోటీలకు మొత్తం 209 మంది క్వాలిఫైయర్లు ఎంపికవగా, చివరకు 11 మంది మాత్రమే ఫైనల్స్ కు సెలక్ట్ అయ్యారు. 11 మందిలో 9 మంది భారతీయ అమెరికన్లే ఉండటం విశేషం. ఈ సారి పోటీలు మాత్రం ఊహకందని విధంగా జరిగాయి. ఎంతో ఉత్కంఠతగా సాగిన పోటీల్లో మొదటిసారి 14 ఏండ్ల నల్లజాతి అమ్మాయి జైలా అవంత్ గార్డ్ అదరగొట్టింది. తన ప్రత్యర్థి అయిన చైత్ర తుమ్ములపై గెలిచి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.
20 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టింది
స్పెల్ బీ పోటీలు అనగానే చాలామందికి భారతీయ అమెరిక్లనే గుర్తుకొస్తుంటారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20 ఏండ్లకు వరకు వీళ్లదే పైచెయ్యి. ప్రపంచవ్యాప్త నలుమూలల నుంచి ఎంతోమంది ప్రతిభావంతులైన పిల్లలు పాల్గొంటున్నప్పటికీ ఏఒక్కరూ కూడా చాంపియన్ గా అవతరించలేదు. కానీ మొదటిసారి నల్లజాతి అమ్మాయి తన అద్భుత ప్రదర్శనతో స్పెల్ బీ చాంపియన్ గా అవతరించింది.
Must Read ;- ఓటమితో పాప ఏడ్చింది.. భారీ ఫండ్ ఓదార్పునిస్తుందా?
14-year-old #ZailaAvantGarde beat Indian American Chaitra Thummala in the final round to become the first Black American to win the contest#SpellingBeeChamp pic.twitter.com/DetaumCvbR
— editorji (@editorji) July 9, 2021










