తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.. రాజకీయాల్లోకి వస్తారా.? రారా.? అనే సస్పెన్స్ కి ఇటీవల తెర దించేసారు. డిసెంబర్ 31న రజనీకాంత్ పార్టీని ప్రకటించనున్నారు. ఈ వార్త తెలిసినప్పటి నుంచి ఆయన పార్టీ గురించి ఇలా రకరకాల ప్రశ్నలు. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న రజనీకాంత్ ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలనుకోవడానికి కారణం ఏంటి.? దైవభక్తి ఎక్కువ గల రజనీకాంత్ జాతకం చూపించుకున్నారా.? ఆయన జాతకంలో ముఖ్యమంత్రి అయ్యే యోగం ఉందన్నారా..? ఇలా అనేక ప్రశ్నలు. ఇదిలా ఉంటే.. తమిళనాడులో వచ్చే సంవత్సరం ప్రథమార్ధంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
Also Read ;- ‘రాజకీయం’ సినిమాగా మారితే.. తీపి, చేదు అనుభవాలు
దీంతో అక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కింది. రజనీ పొలిటికల్ ఎంట్రీ కన్ ఫర్మ్ అయినప్పటి నుంచి.. తమిళనాడులోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. అది ఏంటంటే.. రజనీ కాంత్ ఎన్టీఆర్ రికార్డ్ ను బద్దలు కొట్టగలరా..? అని. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. సామాన్యుడు పార్టీగా తెలుగుదేశం అన్నివర్గాల ఆదరణతో రికార్డ్ స్ధాయిలో సీట్లు గెలుచుకుంది. అధికారం దక్కించుకుంది. అప్పట్లో అదో సంచలనం. ఈ రికార్డ్ ను ఇప్పటి వరకు ఎవరు బద్దలకొట్టలేదు. అది ఒక్క ఎన్టీఆర్ కే సాధ్యం అయ్యింది.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి 8 నెలల్లో అధికారంలోకి రావాలి అనుకున్నారు కానీ.. కుదరలేదు. ప్రజారాజ్యం పార్టీ 18 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఆతర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఇక తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ లేదా మే నెలలో రానున్నాయి. అంటే టైమ్ 6 నెలలు కూడా లేదు. ఇలాంటి టైమ్ లో రజనీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం ఆసక్తిగా మారింది. పార్టీ పెట్టిన 9 నెలల్లో ముఖ్యమంత్రి అయిన రికార్డ్ దేశంలో ఒక్క ఎన్టీఆర్ కే సాధ్యమైంది. మరి.. రజనీకాంత్.. ఎన్టీఆర్ రికార్డ్ ను బ్రేక్ చేస్తారా.? తమిళనాడులో ముఖ్యమంత్రి అవుతారా..? అనేది ఆసక్తిగా మారింది.
Must Read ;- రజనీకాంత్ చరిత్ర సృష్టిస్తారా..? చరిత్రలో కలిసిపోతారా..?