మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు గోవాలో విహరించబోతున్నారు. ఇంతకీ దేనికోసం ఆయన విహారమంటే టైటిల్ పాత్రలో తాను నటిస్తున్న `క్రాక్ ‘ చిత్రం చిత్రీకరణ కోసం ఆయన అక్కడికి పయనమయ్యారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సరస్వతి ఫిలింస్ డివిజన్ పతాకంపై బి.మధు నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే టాకీ భాగం పూర్తయింది. డిసెంబర్ 4 నుంచి గోవాలో చివరి షెడ్యూల్ ను చిత్రీకరించబోతున్నారు. ఈ షెడ్యూల్ లో భాగంగా రవితేజ, హీరోయిన్ శ్రుతి హాసన్‌లపై ఆఖరి పాటను తీయనున్నారు.
దీనికి రాజు సుందరం కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఈ పాటతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఇక చిత్ర కధాంశం గురించి చెప్పాలంటే… తెలుగు రాష్ట్రాల్లో జరిగిన నిజ ఘటనల ఆధారంగా మలుస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాలను ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం తెలియజేస్తూ, ఇటీవల రవితేజ, అప్సరా రాణిపై తీసిన స్పెషల్ పాట “భూమ్ బద్దల్” కు పెద్ద ఎత్తున ప్రేక్షకాదరణ లభించిందని వారు తెలిపారు సంక్రాంతి సందర్భంగా చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు.
ఈ చిత్రంలోని పవర్ ఫుల్ పాత్రలలో వరలక్ష్మీ శరత్‌కుమార్, సముద్రఖని నటిస్తున్నారు. ఇంకా సుధాకర్ కొమాకుల, వంశీ చాగంటి, దేవీప్రసాద్, చిరగ్ జాని, మౌర్యని తదితరులు తారాగణం. ఈ చిత్రానికి ఎస్. తమన్ సంగీతాన్ని, జి.కె. విష్ణు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మాటలు: సాయిమాధవ్ బుర్రా, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కూర్పు: నవీన్ నూలి, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్ ఫైట్స్: రామ్-లక్ష్మణ్, సహ నిర్మాత: అమ్మిరాజు కానుమిల్లి.
Must Read ;- మాస్ మహారాజాతో ఢీ కొడుతున్న యాక్షన్ కింగ్











