మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తనదైన స్టైల్ లో తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తేజ్ తమ్ముడు.. వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు. సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం అందిస్తున్న ఈ సినిమాకు కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం నమ్మకంతో ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.
ముఖ్యంగా ‘నీ కన్ను నీలి సముద్రం.. నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం… నీ నవ్వు ముత్యాల హారం.. నన్ను తీరానికి లాగేటి దారం.. దారం’ అనే పాటకు అనూహ్య స్పందన వచ్చింది. ఈమధ్యకాలంలో ఎవరి నోట విన్నా ఈ పాటే వినపడుతోంది. ఇప్పుడు ఈ పాట 150 మిలియన్ల వ్యూస్ సాధించిన పాటగా రికార్డు సృష్టించింది. తక్కువ సమయంలోనే ప్రేక్షకులకు బాగా రీచ్ అయిన సాంగ్ ఇదేనని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఇందులోని హీరోయిన్ లుక్ ఫ్రెష్ గా ఉండడం బాగా కలిసి వచ్చిన అంశం.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అనేక ఓటీటీ సంస్థలు భారీ ఆఫర్స్ ఇచ్చినా సినిమాను థియాటర్స్ లోనే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు నిర్మాతలు. అందుకు కారణం మరో మెగా హీరో ఇండస్ట్రీకి పరిచయం కావడం వలనే. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాను ఓటీటీలో విడుదల చేస్తే మెగా ఫాన్స్ హర్ట్ అవుతారని, అందుకనే లేట్ అయినా సినిమాను థియాటర్స్ లోనే రిలీజ్ చేస్తామని ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రానికి కథను సుకుమార్ అందిస్తున్నాడు.
Must Read ;- నాని సరసన ‘ఉప్పెన’ హీరోయిన్











