కడప జిల్లా రాయచోటికి చెందిన వైసీపీ కీలక నేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడిని కలిశారు. త్వరలో టీడీపీలో చేరడానికి రాం ప్రసాద్ రెడ్డి సిద్ద పడినట్టు తెలుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతున్నా పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న రాంప్రసాద్ రెడ్డి ఇవాళ శ్రీకాళహస్తిలో చంద్రబాబును కలిశారు. రాయచోటిలో వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గెలుపులో రాంప్రసాద్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. రాయచోటి వైసీపీలో మంచి పట్టున్న నేతగా రాంప్రసాద్ రెడ్డికి పేరుంది.
ఇంకా ఆగలేం..
పదేళ్లుగా వైసీపీ జెండా మోసినా పదవులకు నోచుకోలేదని రాంప్రసాద్ రెడ్డి వాపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతున్నా తమను పట్టించుకోవడం లేదని తీవ్ర నిరాశ, అసంతృప్తితో ఆ పార్టీని వీడుతున్నట్టు రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. త్వరలో రాయచోటి నియోజకవర్గంలో అనుచరులతో సహా టీడీపీలో చేరనున్నట్టు రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. తిరుపతి ఉప ఎన్నికల తరవాత రాంప్రసాద్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
Must Read ;- వైసీపీ ఎమ్మెల్యేకు అడుగడుగునా అవమానం : మా గ్రామాలకు రావొద్దు!