ఎన్నికల అధికారులు చేసిన తప్పిదంతో ఓల్డ్ మలక్‌పేటలో రీపోలింగ్‌కు దారితీసింది. మలక్‌పేట్ డివిజన్‌లో డిసెంబర్ 1వ తేదీన జరగాల్సిన ఎన్నికలు బ్యాలెట్ పేపర్‌లో జరిగిన తప్పిదం కారణంగా ఆ డివిజన్‌లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. సీపీఐ గుర్తుకు బదులు సీపీఐ(ఎం) గుర్తు ఉండడంతో ఓటర్లు ఆందోళన చేశారు. అలాగే సీపీఐ నేతలు సైతం ఈ తప్పిదాన్ని ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ఆ డివిజన్‌లో ఎన్నికలు నేటికి వాయిదా పడ్డాయి. వాయిదా పడ్డ ఎన్నికలు ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది.
అయితే పాత మలక్‌పేట్ డివిజన్‌లో 69 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొన్న 1వ తేదీన జరిగిన ఎన్నికల్లో జరిగిన తప్పిదాన్ని గుర్తించేలోపే చాలా మంది ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఓటేసిన వారందరికీ సిరా గుర్తు కూడా పెట్టేశారు. అయితే రీపోలింగ్‌లో భాగంగా మళ్లీ వారందరూ ఈ రోజు పోలింగ్‌లో పాల్గొంటారు. కన్ఫ్యూజన్ తలెత్తకుండా ఉండేందుకు చూపుడు వేలుకి కాకుండా మధ్యవేలుకి సిరా గుర్తు పెట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ డివిజన్‌లో మొత్తం 54,665 ఓటర్లు ఉన్నారు. ఓటేసేందుకు 69 పోలింగ్ కేంద్రాలతో పాటు 350 మంది ఎన్నికల సిబ్బందిని ఏర్పాటు చేశారు.
ఇక్కడ మొత్తం 6గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి పగిల్ల షాలిని, సీపీఐ నుంచి ఫిర్దౌస్ ఫాతిమా, బీజేపీ నుంచి కనకబోయిన రేణుక, కాంగ్రెస్ నుంచి వీరమణి, ఎంఐఎం నుంచి జవేరియా ఫాతిమా, ఇండిపెండెంట్‌గా కవిత పోటీలో ఉన్నారు.
రీపోలింగ్ జరుగుతుండడంతో ఎగ్జిట్ పోల్స్‌పై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. పోలింగ్ ముగిసే వరకు ఎగ్జిట్ పోల్స్‌కు అనుమతిలేదు. దాంతో ఈ రోజు సాయంత్రం 6 గంటల తరువాతే ఎగ్జిట్ పోల్స్ విడుదలకు అవకాశం ఉంది.
Must Read ;- రాష్ట్రంలో బీజేపీ ‘బండి’లాగే సమర్ధుడు సంజయుడే!










