ఓ పవర్ ఫుల్ లేడీ ఓరియంటెడ్ పాత్రను రేణు దేశాయ్ పోషిస్తున్నారు. ఇది పాన్ ఇండియా సినిమా అంటున్నారు. రేణూ దేశాయ్ కి ఇది సెకండ్ ఇన్నింగ్స్. డి.ఎస్.కె. స్క్రీన్-సాయికృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై రావ్. డి.ఎస్- రజనీకాంత్. ఎస్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం తో యువ దర్శకుడు ఎం.ఆర్.కృష్ణ మామిడాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక, నందిని రాయ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో ‘వైభవ్ తత్వవాడి’ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ‘హుషారు’ ఫేమ్ తేజ కురపాటి- గీతిక రతన్ యువ జంటగా నటించే ‘ఆద్య’ విజయదశమి రోజు ఆరంభం కానుంది. రేణు దేశాయ్ రీ ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రం జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని నిర్మాత రజనీకాంత్.ఎస్ తెలిపారు.











