యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న పీరియాడికల్ లవ్ స్టోరీ ‘రాధేశ్యామ్’. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పాన్ ఇండియా కేటగిరిలో బహుభాషల్లో రిలీజ్ కాబోతోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకుంటోన్న ఈ సినిమాకి తమిళ సంగీత దర్శకుడు జెస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు. జూలై 30న విడుదలకు సిద్ధమవుతోన్న రాధేశ్యామ్ చిత్ర బృందం ఇంతవరకూ టీజర్ ను విడుదల చేయలేదు. గతంలో వచ్చిన మోషన్ పోస్టర్, ఇతర పోస్టర్స్ మాత్రమే అభిమానుల్ని మెప్పించాయి. ఇక నేడు శివరాత్రి సందర్భంగా యూవీ క్రియేషన్స్ వారు ఒక స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు.
మంచుకొండల్లో ప్రభాస్, పూజా హెగ్డే ఇద్దరూ వ్యతిరేక దిశలో ఒకరి తల దగ్గరకి మరొకరి తల వచ్చేలా పడుకొని.. రొమాన్స్ చేసుకుటంటున్న ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘కొందరు దీనిని పిచ్చంటారు. మేము మాత్రం దీన్ని ప్రేమ అంటాం. ఈ ప్రేమకథ మీ గుండెల్లో కలకాలం నిలిచిపోతుంది’… అంటూ పొయటిక్ గా దీన్ని రివీల్ చేశారు మేకర్స్ . కృష్ణం రాజు ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న రాధేశ్యామ్ సినిమా ఏ రేంజ్లో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
Also Read : ‘రాధేశ్యామ్’ రిలీజ్ ఆలస్యానికి కారణం ఇదేనా.?











