బాలీవుడ్ లో ఇప్పుడు సారా ఆలీఖాన్ అంటే.. బోలెడు క్రేజ్. ఇటు సైఫ్ ఆలీఖాన్ నటవారసురాలిగానూ, అటు.. తను ఓన్ గా క్రియేట్ చేసుకున్న స్టైల్ పరంగానూ ఆమెకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. కమర్షియల్ హీరోయిన్ గా ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్న సారా.. సోషల్ మీడియాలోనూ తన ఫ్యాన్స్ తో ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది.

తరచుగా తన ఇన్ స్టా ఖాతాలో సారా పోస్ట్ చేసే ఫోటోస్ రెగ్యులర్ గా వైరల్ అవుతునే ఉంటాయి. తాజా గా ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోస్ నెటిజెన్స్ ను భలేగా ఆకర్షిస్తున్నాయి. నీలిరంగు దుస్తులు ధరించి ఆమె ఇచ్చిన సెన్సువల్ పోజెస్.. భలేగా వైరల్ అయ్యాయి. నీలిమబ్బులాంటి దుస్తుల్ని జారవిడిచి ఒళ్ళు మరిచినట్టు ఉందంటూ.. ఆ ఫోటోస్ కు కామెంట్స్ పడుతున్నాయి.

బిఫోర్ లాస్టియర్ ‘కేదార్నాథ్’ సినిమాతో బాలీవుడ్ లో కథానాయికగా రంగ ప్రవేశం చేసిన సారా ఆలీఖాన్ .. ఆ తర్వాత సింబాతో కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఈ ఏడాది మరో సినిమాతో రాబోతోంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా పలు ప్రాజెక్ట్స్ చర్చల దశలోనే ఆగిపోయాయి. ఈ ఏడాదే మరో సినిమా ఉంటుంది. అలాగే.. సౌత్ లో కూడా సారా నటించే అవకాశముందని సమాచారం.
Must Read ;- నిర్మాణ రంగంలోకి బాలీవుడ్ ఫైర్ బ్రాండ్












