RRR Janani Song Launched For Press
బాహుబలి తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో మల్టీ స్టారర్ మూవీగా ‘ఆర్ఆర్ఆర్’ను రూపొందించిన దర్శకధీరుడు రాజమౌళి ఆ సినిమా ప్రోగ్రెస్ ను మీడియాకు వివరించారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీ జనవరి 7గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 11 వేల స్క్రీన్ లతో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ పై రాజమౌళి దృష్టి సారించారు. అందుకే నిర్మాత డీవీవీ దానయ్యతో కలిసి మీడియా ముందుకు వచ్చారు. వచ్చే నెల నుంచి ఈ సినిమాకు సంబంధించి వరుస ఈవెంట్లు ఉంటాయని వెల్లడించారు.
ఈ సినిమాలోని జనని అనే పాట విడుదల కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. ట్రిపుల్ ఆర్ ట్రైలర్ విడుదల వచ్చే నెలలోనే ఉంటుందట. దీంతో పాటు ప్రీరిలీజ్ ఈవెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయట. జనని మెలోడీని ప్రస్తుతం మీడియాకు మాత్రమే ప్రదర్శించారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో సోల్ యాంథమ్ ఇది. సంగీత దర్శకుడు కీరవాణి దీన్ని అద్భుతంగా కంపోజ్ చేశారు. దీన్ని ఈరోజు కేవలం థియేటర్లలోనే విడుదల చేశారు. సోషల్ మీడియాలో రేపు అధికారికంగా విడుదల చేస్తారు. ఈ సినిమా ప్రధాన తారాగణమంతా ఓ మీడియా సమావేశంలో హాజరవుతారని రాజమౌళి చెప్పారు.
RRR Janani Song Launched For Press
11 వేల థియేటర్లలో విడుదల
ట్రిపుల్ ఆర్ సినిమా విడుదల పరంగా కొత్త రికార్డు సృష్టించబోతోంది. ఇంతకుముందు బాహుబలి 9 వేల థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా 11 వేల థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల్లో 1500 థియేటర్లలో విడుదలవుతోంది. ఉతర భారతదేవంలో 4000, తమిళనాడులో 800, కర్ణాటకు 650, కేరళలో 400, అమెరికాలో 3000 థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించారు. ఇక ఇతరత్రా మరో వెయ్య థియేటర్లలో విడుదలవుతుంది. థియేటర్ల విషయంలో పక్కా ప్లానింగ్ తో వ్యవహరిస్తున్నారు. ముందుగానే దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు.
Must Read ;- ఆర్ఆర్ఆర్.. పవర్ ఫుల్ డైలాగ్ ఇదే