కరోనా వలన షూటింగ్ లకు బ్రేక్ పడడంతో.. ఎప్పుడూ బిజీగా ఉండే సినీ ప్రముఖులు ఇంటికే పరిమితం అయ్యారు. దీంతో సోషల్ మీడియాలో పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటున్నారు. మెగా హీరో సాయిధరమ్ తేజ్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంటారు. తన సినిమాల గురించి తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అయితే.. సాయిధరమ్ తేజ్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. అంతే కాకుండా దీనికి సంబంధించిన ఓ ఫోటోను కూడా పోస్ట్ చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఇంతకీ విషయం ఏంటంటే.. ఒకే బెడ్ మీద తాను, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ పడుకునేవాళ్లమని… ఇప్పటికీ అలాగే పడుకుంటున్నామని చెప్పాడు. చెప్పడమే కాకుండా ముగ్గురు ఒకే బెడ్ మీద పడుకున్న ఫోటోను పోస్ట్ చేశాడు. ఈ ఫోటో చూడడానికి చాలా ఫన్నీగా ఉంది. ఇందులో వరుణ్ తేజ్ దొంగ చూపులు చూస్తుంటే.. వైష్ణవ్ తేజ్ షర్ట్ లేకుండా ఉన్నాడు. మెగా హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్.. ఇలా అందరూ ఒకే చోట పెరిగారు. వీళ్లు అందరూ ఒక చోట కలిస్తే… అల్లరే అల్లరి.
సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆ ముగ్గురూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నారు. వరుణ్ తేజ్ ప్రస్తుతం గని చిత్రంలో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. జులై 30న రిలీజ్ చేయాలి అనుకున్నారు. కరోనా కారణంగా ఆగింది. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని సమాచారం. సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ రిలీజ్ రెడీగా ఉంది. ఇక వైష్ణవ్ తేజ్.. ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. తొలి ప్రయత్నంలోనే బ్లాక్ బస్టర్ సాధించాడు. ఆ తర్వాత వైష్ణవ్ తేజ్ వరుసగా మూడు సినిమాలకు ఓకే చెప్పాడు. ఈ విధంగా ఈ ముగ్గురు హీరోలు కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నారు.
Must Read ;- మెగా కాంపౌండ్ లో హరీష్ మరో ప్రయాణం











