నాటి నుంచి నేటి వరకు హీరోలు, హీరోయిన్ లు, దర్శకులు, నిర్మాతలు.. తమ వారసులను ఇండస్ట్రీలో పరిచయం చేస్తుండడం తెలిసిందే. అయితే.. సినిమా బ్యాక్ గ్రౌండ్ తో ఎంత మంది వచ్చినా.. ఇక్కడ టాలెంట్ ఉంటేనే రాణిస్తుంటారు. ఇది అందరికీ తెలిసిందే. రీసెంట్ గా మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ బావమరిది హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారని వార్తలు వస్తున్నాయి.
ఫేమస్ బిజినెస్ మేన్ నార్నే శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మీ ప్రణతిను ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నార్నే శ్రీనివాసరావు కుమారుడు, లక్ష్మీ ప్రణతి సోదరుడు నితిన్ చంద్రను హీరోగా పరిచయం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కొత్త వాళ్లను పరిచయం చేస్తూ.. విబిన్న ప్రేమకథా చిత్రాలను అందించి ఓ ట్రెండ్ క్రియేట్ చేసిన తేజ డైరెక్షన్ లో నితిన్ చంద్రను హీరోగా పరిచయం చేయాలి అనుకున్నారట. అంతా సెట్ అయ్యింది.. ఇక అఫిషియల్ గా అనౌన్స్ చేయడమే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో అనుకోని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ ఆగింది.
దీంతో ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ సెట్ చేసే పనిలో ఉన్నారట. నితిన్ యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకుని సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు. మాంచి లవ్ స్టోరీతో పరిచయం చేయాలనుకుంటున్నారట. రీసెంట్ గా ఎన్టీఆర్ సజెషన్ తో ఓ స్టోరీని ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలో ఈ సినిమాని అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాని నితిన్ చంద్ర ఫాదర్ నార్నే శ్రీనివాసరావు నిర్మించనున్నారని సమాచారం. ఎన్టీఆర్.. తన బావమరిదిని హీరోగా నిలబెట్టేందుకు తన వంతుగా పూర్తి సహకారాన్ని అందిస్తానని మాట ఇచ్చారట. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా ఇక్కడ టాలెంట్ ఉంటేనే రాణిస్తుంటారు. మరి.. ఎన్టీఆర్ సపోర్ట్ తో రాబోతున్న నితిన్ చంద్ర ఎంత వరకు రాణిస్తారో చూడాలి.
Must Read ;- ఎన్టీఆర్ తో వైజయంతీ మూవీస్ భారీ ప్లాన్