పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలు చేస్తూ.. మరో వైపు పొలిటికల్ గా బిజీగా ఉన్నారు. అయితే.. వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ ఒక సినిమా తర్వాత మరో సినిమా చేస్తారనుకుంటే.. వరుసగా సినిమాలు చేస్తూ.. ఫ్యాన్స్ తో పాటు అందర్నీ సర్ ఫ్రైజ్ చేస్తున్నారు. ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో ఓ భారీ పిరియాడిక్ మూవీ చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా కోసం పవన్ పై రెండు పాటలను చిత్రీకరించినట్టు సమాచారం.
ఈ సినిమా తర్వాత అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ క్రేజీ మూవీకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు అందిస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ సినిమా పూర్తైన తర్వాత గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో మూవీ చేయనున్నారు. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.
ఆతర్వాత స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో సినిమా చేయనున్నారు. ఇప్పుడు మరో డైరెక్టర్ కి పవన్ ఓకే చెప్పారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ.. ఎవరా డైరెక్టర్ అంటే.. రమేష్ వర్మ అని సమాచారం. ప్రస్తుతం రమేష్ వర్మ మాస్ మహారాజా రవితేజతో ఖిలాడీ సినిమా చేస్తున్నారు. అయితే.. పవన్ కళ్యాణ్ – రమేష్ వర్మ కాంబినేషన్ లో మూవీని బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.
Must Read ;- ‘వకీల్ సాబ్’ కామిక్ బుక్.. సోషల్ మీడియాలో వైరల్