శేఖర్ కమ్ముల సినిమా అంటేనే అది కచ్చితంగా ఫీల్ గుడ్ మూవీ అయి తీరుతుంది. ఇంతకుముందు సాయిపల్లవితో ‘ఫిదా’ చేసిన శేఖర్ కమ్ముల మరోసారి కూడా సాయిపల్లవితో లవ్ స్టోరీ మొదలు పెట్టారు. ఇందులో నాగచైతన్య హీరోగా నటించారు. ఈ సినిమా టీజర్ ఈ ఉదయం విడుదలైంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. సున్నితమైన భావోద్వేగాలను పండించడంలో శేఖర్ కమ్ముల దిట్ట అనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రేమ కథలకు ఆయన న్యాయం చేస్తారు. యూత్ టార్గెట్ గా ఈ లవ్ స్టోరీ తెరకెక్కింది. త్వరలోనే ఈ సినిమాని విడుదల చేసే పనిలో ఉన్నారు.
Must Read ;- టాక్ షోలో సమంతను టీజ్ చేసిన నాగచైతన్య