ఓటీటీతో ఒప్పందాలు కుదుర్చుకోవడంలో బాలీవుడ్ నిర్మాతలు ముందున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో అమెజాన్ ప్రైమ్ దూకుడు మీద ఉంది. షేర్షా, సర్దార్ ఉదమ్ చిత్రాల తర్వాత సైఫ్ నటించిన బంటీ ఔర్ బబ్లీ 2, అక్షయ్ కుమార్ ‘పృథ్వీరాజ్’ తోపాటు యశ్ రాజ్ ఫిలిమ్స్ కు సంబంధించి ఐదు చిత్రాల ఒప్పందం జరిగింది. రణవీర్ సింగ్ జయేష్ భాయ్ జోర్దార్, రణబీర్ కపూర్ షంషేరా చిత్రాలు కూడా ఇలా ఒప్పందంలోకి వెళ్లిపోయాయి. ఇప్పుడు ఈ కోవలో మరో అగ్ర నిర్మాత సాజిద్ నడియావాలాకు చెందిన నడియాద్ వాలా గ్రాండ్ సన్ ఎంటర్ టైన్ మెంట్ కూడా అమెజాన్ తో రూ. 250 కోట్లతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది.
ఐదు చిత్రాలతో ఈ ఒప్పందం ఉంది. వీటిలో సల్మాన్ ఖాన్ నటించిన కిక్ 2 కూడా ఉంది. ఈ సినిమా ఇంకా స్క్రిప్టు దశలోనే ఉంది. చిత్రీకరణ కూడా ఇంకా ప్రారంభం కాలేదు. కానీ ఒప్పందం మాత్రం కుదిరింది. అయాన్ శెట్టి, తారా సుతారియా నటించిన తడప్ చిత్రం కూడా ఈ ఒప్పందంలో ఉంది. కరోనా తర్వాత ఓటీటీ ఇంపార్టెన్స్ పెరిగింది. వీటికి సబ్ స్క్రైబర్స్ భారీగా పెరుగుతున్నారు. డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ అన్నీ సినిమాల కొనుగోలుకు పోటీపడుతున్నాయి. భారీ మొత్తంలో నిధులు వెచ్చిస్తున్నాయి.
అక్షయ్ కుమార్ నటించిన బచ్చన్ పాండే, టైగర్ ష్రాఫ్ హీరో పంటీ 2, కబీ ఈద్ కబీ దివాలీ, సత్యనారాయణ్ కీ కథ చిత్రాలను అమెజాన్ ప్రైమ్ కి అమ్మేసినట్టు చెబుతున్నారు. ఈ సినిమాలన్నీ థియేటర్లలోనూ, ఓటీటీలోనూ ఒకే సమయంలో విడుదల చేయాలన్న నిర్ణయం జరిగిందంటున్నారు. సల్మాన్ ఖాన్ కిక్ 2 చిత్రాన్ని ఇందులో చేర్చబట్టే ఇంత పెద్ద మొత్తంలో డీల్ కుదరటానికి అవకాశం ఏర్పడింది. తడప్ సినిమా విషయానికి వస్తే ఇది తెలుగులో విజయవంతమైన ఆర్ ఎక్స్ 100 చిత్రానికి రీమేక్. ఈ సినిమా డిసెంబరు 3న విడుదల కానుంది. బాలీవుడ్ కు సంబంధించినంతవరకూ ఓటీటీతో ఇది మెగా కాంట్రాక్ట్ అనే చెప్పాలి.
Must Read ;- బాలీవుడ్ హీరోతో పూరి సినిమా నిజమేనా?











