ఇసుక మాఫియా చెలరేగిపోవడం అనేది అనేక రకాలుగా జరుగుతోంది. ఇసుక తవ్వకాల ప్రాంతాల్లో చెలరేగిపోవడం ఒక ఎత్తు. తవ్వకాల్లో అక్రమాలు ఒక ఎత్తు. ఇసుక తవ్వకాల పేరుతో.. వీర బీభత్స దందాలు నడిపించడం ఒక ఎత్త. చివరికి ఇసుక మాఫియా.. గ్రామాల్లో పెద్దఎత్తున చెట్లు కూడా నరికేస్తూ మరో లెవెల్‌కు తమ దాష్టీకాలను తీసుకువెళుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లా లంకల గన్నవరం ఇసుక స్టోరేజ్ కొసం ఇసుక మాఫియా పెద్ద ఎత్తున చెట్లు నరికి వేసిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. కేవలం చెట్లు నరకడం మాత్రమే కాదు.. ఇదేమని ప్రశ్నించబోయిన వారిని ఏకంగా తుపాకులు చూపి బెదిరిస్తూ దౌర్జన్యానికి దిగడం పరాకాష్ట.
రెండు రోజులుగా గ్రామంలో ఇసుక మాఫియా హల్ చల్ చేస్తున్నారు. పెద్దఎత్తున చెట్లు నరికేశారు. ఇసుక స్టోరేజీ కోసం చెట్లు నరికేయడాన్ని గ్రామాస్తులు తీవ్రంగా వ్యతిరేకించినా ఫలితం దక్కలేదు. దీంతో ఇసుక మాఫియా ఆగడాలను గ్రామస్థులు మూకుమ్మడిగా అడ్డుకున్నారు.
Must Read ;- చట్టం తనపని తాను చేయడం లేదా.. రెచ్చిపోతున్న ఇసుకాసురులు
కుసుమ సునీత ఆమె కుమారుడు గ్రామస్తులను తుపాకులతో బెదిరించి వెళ్లగొట్టడం ఈ దందాకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇసుక మాఫియా వారే తుపాకులు చూపి బెదరగొట్టి భయపెట్టి తరమడానికి అదనంగా.. తిరిగి వాళ్లే గ్రామస్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇంకో ట్విస్టు. ఈ వ్యవహారానికి సంబంధించి, ఇరు వర్గాల వారు ఒకరి పై ఒకరు పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసుకున్నారు.
పోలీసులు ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామస్తులను బెదిరించడానికి, భయపెట్టడానికి వాడిని తుపాకీని, పిట్టలు కొట్టే గన్ గా నిర్ధారించి , ఆ గన్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గన్ ఎలాంటిదైనా అయిఉండొచ్చు గానీ.. దానిని చూపి భయపెట్టాలనే వారి ధోరణి ప్రమాదకరమైనదనే నిరసన గ్రామస్తుల్లో వ్యక్తం అవుతోంది.
Also Read ;- దశా దిశా లేని దిశ చట్టం అస్తవ్యస్తమైన ఇసుక విధానం ఇవీ జగన్ నిర్ణయాలు